షూటింగ్స్ కు పర్మీషన్ ఇస్తే సెట్స్ కు వెళ్లిపోతాం అని చాలా మంది నిర్మాతలు ప్రభుత్వానికి రిక్వెస్టులు పెట్టాయి. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో చర్చలు జరిపారు.  అయితే షూటింగ్స్ కు పర్మీషన్ వచ్చాక, చాలామంది నిర్మాతలు వెనుకడుగు వేస్తున్నారు. గవర్నమెంట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా సెట్స్ కు వెళ్లడానికి ఆలోచిస్తున్నారు నిర్మాతలు. మరి అనుమతులు వచ్చాక కూడా ప్రొడ్యూసర్స్ ఎందుకు వెనక్కి వెళ్తున్నారు. 

 

లాక్ డౌన్ సడలింపులు ఇవ్వగానే హీరోలు, దర్శక నిర్మాతలు అంతా కలిసి మళ్లీ షూటింగ్ లు జరుపుకోవడానికి అవకాశం ఇవ్వాలంటూ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలిశారు. కోవిండ్ నిబంధనలను పాటిస్తూ షూటింగ్ చేసుకుంటామని రిక్వెస్ట్ లెటర్ లు పెట్టారు. కానీ ఇప్పుడా నిబంధనలు చూసి చాలామంది నిర్మాతలు వెనుకడుగు వేస్తున్నారు. ఆర్థిక భారం మోయలేక మరికొన్నాళ్లు ఎదురు చూద్దాం అనే ఇదిలో ఉన్నారు. 

 

షూటింగ్స్ కు పర్మీషన్స్ ఇస్తూ కొన్ని నిబంధనలు పెట్టింది తెలంగాణ ప్రభుత్వం. సెట్స్ లో తప్పనిసరిగా ఒక డాక్టర్ ఉండాలని.. శానిటైజర్లు, గ్లవుజుల, హ్యాండ్ వాష్ లు, మాస్క్ లు ఏర్పాటు చేయాలని నిబంధనలు పెట్టింది ప్రభుత్వం. అలాగే సెట్స్ లో 45మందికి మించి ఉండకూడదని కండీషన్స్ పెట్టింది. అయితే ఈ నిబంధనలే భారంగా మారుతున్నాయని భావిస్తున్నారు నిర్మాతలు. 

 

హీరో నితిన్ తండ్రి డిస్ట్రిబ్యూటర్ కమ్ సుధాకర్ రెడ్డి రీసెంట్ గా ఓ మీడియా హౌజ్ తో మాట్లాడుతూ.. ఇన్ని నిబంధనల మధ్య షూటింగ్ లు చేయడం సాధ్యం కాదని చెప్పాడు. సెట్స్ లో వంద నుంచి 125మంది వరకు పని చేయాల్సి ఉంటుంది. అలాంటిది 45 మందితో షూటింగ్ చేయడమంటే కష్టమన్నాడు. పైగా ఇది నిర్మాతలపై అదనపు భారం మోపుతుందని అభిప్రాయపడ్డాడు. 

 

ఇప్పటికే అర్థాంతరంగా ఆగిపోయిన షూటింగ్ లతో నిర్మాతలు వడ్డీల భారం మోస్తున్నారు. ఆర్టిస్టులకు, టెక్నీషియన్లకు ఇచ్చిన అడ్వాన్సులతో నిర్మాతల బ్యాంక్ బ్యాలెన్స్ కూడా తగ్గిపోయింది. ఇలాంటి సిట్యుయేషన్ లో డాక్టర్లు వాళ్ల ఫీజులు, శానిటైజర్లు, మాస్కుల ఖర్చు మరింత భారంగా మారుతున్నాయనుకుంటున్నారు నిర్మాతలు. 

మరింత సమాచారం తెలుసుకోండి: