ప్రస్తుత పరిస్థితులు ఓటీటీ ప్లాట్ ఫామ్స్ కు అనుకూలంగా కనిపిస్తోంది. ఇప్పట్లో థియేటర్స్ ఓపెన్ అయ్యేలా లేకపోవడంతో.. నిర్మాతలకు ఓటీటీనే బెస్ట్ ఆప్షన్ లా మారింది. దాంతో వరుస సినిమాలు రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. 

 

కరోనా విజృంభిస్తున్న వేళ వినోదానికి పెద్ద పీఠ వేస్తున్నాయి ఓటీటీ ప్లాట్ ఫామ్స్. రెడీ ఫర్ రిలీజ్ అంటున్న సినిమాలను ఓటీటీల్లో విడుదల చేసేందుకు భారీ ఆఫర్స్ ను ప్రకటిస్తూ.. నువ్వా నేనా అన్నట్టు పోటీ పడుతున్నాయి కొన్ని పెద్ద సంస్థలు. నిర్మాతలు సైతం ఇప్పట్లో థియేటర్స్ తెరుచుకునే పరిస్థితులు కనిపించకపోవడంతో.. ఓటీటీలో సినిమాలు రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. 

 

అయితే కొన్ని సినిమాలు మాత్రం ఎంత ఆలస్యమైనా సరే థియేటర్లలోనే రిలీజ్ చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు. కానీ కొంతమంది ఒక మోస్తారు లాభాలు వచ్చినా పరవాలేదు గానీ.. ఓటీటీలో రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు. ఇందులో తెలుగు, హిందీ, కన్నడ, మళయాళం సినిమాలు.. ఓటీటీల్లో విడుదలకు సిద్దంగా ఉన్నాయి. ఆ కోవాకు చెందిన వాటిలో.. ఇప్పటికే ఘూమ్ కేటు, జ్యోతిక పోన్ మగళ్ వందన్ రిలీజ్ అయ్యాయి. 

 

ఆయుష్మాన్ ఖురానా.. అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో నటించిన గులాబో సీతాబో కూడా రిలీజ్ అయింది. అలాగే విద్యాబాలన్ నటించిన శకుంతల దేవి త్వరలోనే విడుదలకు సిద్ధమవుతోంది. కన్నడ చిత్రం లా.. జూన్ 26న, ఫ్రెంచ్ బిర్యానీ.. జులై 24న, అదితి రావు హైదరీ, జయసూర్య నటించిన మలయాళ చిత్రం సుఫియం సుజాతయం కూడా విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.  

 

ఓటీటీలో రిలీజ్ కు రెడీగా ఉన్న చిత్రాల్లో ఓ రెండు మాత్రం చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. వాటిలో కీర్తి సురేష్ నటించిన పెంగ్విన్ టీజర్.. ఇప్పటికే ఆడియన్స్ లో క్యూరియాసిటీ పెంచేయగా.. లేటెస్ట్ గా రిలీజైన ట్రైలర్ మరింత ఉత్కంఠ రేపుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: