ఇప్పుడు షూటింగ్స్ అంటేనే భయపడుతున్నారు సినీ స్టార్స్. దాంతో కరోనా కాలం పోయేవరకు వెయిట్ చేయాలని భావిస్తున్నారు. అందుకే ఓ బాలీవుడ్ బ్యూటీని షూటింగ్ కు పంపించేందుకు ఒప్పుకోను అంటున్నాడు ఆమె తండ్రి. 


కరోనా వల్ల వచ్చిన లాక్ డౌన్ సినిమా షూటింగ్స్ అన్నీ ఆగిపోయాయి. అయితే సడలింపుల కారణంగా ఇటీవలే షూటింగ్స్ కు పర్మీషన్స్ వచ్చాయి. దాంతో ఎప్పుడెప్పుడు షూటింగ్ కు వెళ్దామా.. అని ఎదురు చూస్తున్నారు ఫిల్మ్ మేకర్స్. కానీ కొందరు స్టార్స్ మాత్రం ఖరాఖండీగా నో చెబుతున్నారు. బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధాకపూర్ కూడా ఏది ఏమైనా సరే.. షూటింగ్ కు అస్సలు రాదని చెబుతున్నారు. 

 

శక్తి కపూర్ డాటర్ గా కంటే.. తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది శ్రద్ధాకపూర్. వరుస ఆఫర్స్ తో దూసుకెళ్తున్న ఈ బ్యూటీని షూటింగ్ కు పంపించేందుకు ససేమిరా అంటున్నాడు ఆమె తండ్రి. కరోనా వైరస్ వల్ల పరిస్థితులు భయంకరంగా మారాయనీ.. తన కుమార్తెని తిరిగి ఇప్పుడే షూటింగ్స్ కు వెళ్లనివ్వనని చెప్పుకొచ్చాడు శక్తికపూర్. దాంతో శ్రద్ధా కపూర్ కమిట్ అయిన ప్రాజెక్ట్స్ పరిస్థితి ఏంటనేది ఇప్పుడు చర్చకు దారితీసింది. 

 

నా కుమార్తెను షూటింగ్స్ కు పంపించాలనుకోవడం లేదు. కరోనా వైరస్ ప్రభావం తగ్గలేదు. మున్ముందు పరిస్థితులు ఇంకా దారుణంగా ఉంటాయి. మనిషి ప్రాణాలకంటే పని ముఖ్యం కాదు.. షూటింగ్స్ కోసం ఇంకొంత కాలం వెయిట్ చేయాలని సెలవిచ్చాడు శక్తికపూర్. నిజమే.. ప్రస్తుతం ముంబయిలో కరోనా వ్యాప్తి చాలా డేంజర్ గా ఉంది. షూటింగ్స్ ఇప్పుడే వద్దనీ.. మరికొంత మంది బాలీవుడ్ స్టార్స్ డిసైడ్ అయ్యారట. ఏది ఏమైనా.. కరోనా కాలంలో షూటింగ్ అంటే రిస్క్ అనే చెప్పాలి. మొత్తానికి సినీనటులు ఇపుడు షూటింగ్ అంటేనే తెగ భయపడిపోతున్నారు. షూటింగ్స్ కు పర్మీషన్ వచ్చినా.. కెమెరా ముందుకు వచ్చేందుకు యాక్టర్స్ భయపడుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: