టాలీవుడ్ లో పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కి ఆసక్తిని రేకెత్తించిన సినిమా నిశబ్ధం. ఈ సినిమాను కోన వెంకట్ నిర్మించారు. అనుష్క, మాధవన్, అంజలి, శాలిని పాండే నటించిన ఈ భారీ సినిమాని ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం లో ఈ సినిమాని రిలీజ్ చేయనున్నారు. వరసగా పాన్ ఇండియా సినిమాలను నిర్మిస్తున్న కోన వెంకట్ త్వరలో దర్శకుడిగాను మారబోతున్నారు. అయితే ఇక సౌత్ లో గత నాలుగైదు ఏళ్ళలో బయోపిక్స్ ట్రెండ్ బాగా పాపులర్ అయింది. జీవిత కథలతో కమర్షియల్ సినిమాలను రూపొందించి భారీ సక్సస్ లను అందుకుంటున్నారు మేకర్స్..హీరోస్. 

 

ఈ నేపథ్యంలోనే కథా రచయిత, నిర్మాత కోన వెంకట్ 2000లో జ‌రిగిన ఒలింపిక్స్ వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో కాంస్య ప‌త‌కం సాధించ‌డ‌మే కాకుండా ఒలింపిక్స్‌లో ప‌తకం సాధించిన తొలి భార‌తీయ మ‌హిళగా రికార్డ్ క్రియేట్ చేసిన క‌ర‌ణం మల్లేశ్వరి జీవితాన్ని వెండితెర మీద ఆవిష్క‌రించ‌నున్నారు. కోన ఫిల్మ్ కార్పోరేషన్, ఎం.వి.వి.సినిమా బ్యానర్ పై కోన‌వెంక‌ట్  ఎం.వి.వి.స‌త్య‌నారాయ‌ణ‌ భారీ పాన్ ఇండియా సినిమాగా నిర్మిస్తున్నారు. సంజ‌నా రెడ్డి తెర‌కెక్కిస్తున్న ఈ సినిమాకి సంబంధించిన న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల వివ‌రాల‌ను త్వరలో ప్ర‌క‌టించనున్నారు. 

 

అయితే ఈ సినిమాలో క‌ర‌ణం మల్లేశ్వరి గా నటించే హీరోయిన్ ఇంకా ఫైనల్ కాలేదని ఆ పాత్రకు సరిగ్గా సూటయ్యో హీరోయిన్ కోసం కోన వెంకట్ జల్లెడ పడుతున్నాడని సమాచారం. అయితే ఈ కోన వెంకట్ ఈ సినిమాని అనౌన్స్ చేసినప్పటి నుంచి హీరోయిన్ గా రకరకాల పేర్లు వినిపించాయి. ఆ పేర్లలో ప్రధానంగా నిత్యా మీనన్ పేరు వినిపించింది. అందరు నిజమని అనుకున్నారు. కాని అందులో వాస్తవం లేదని తేలిపోయింది. ఆ తర్వాత బాలీవుడ్ నటి భూమి పడ్నేకర్ పేరు తెర మీదకి వచ్చింది. ఇది కూడా గాసిప్ అని అసలింతవరకు ఈ సినిమాలో నటించే హీరోయిన్ ని మేము అనౌన్స్ చేయలేదని చిత్ర బృందం తెలిపారట.

 

ఇక ప్రస్తుతం ఈ సినిమాకి పక్కాగా స్క్రిప్ట్ రెడీ చేసే పనిలో కోన వెంకట్ బిజీగా ఉన్నాడు. రాజుగాడు సినిమాతో దర్శకురాలిగా మారి టాలీవుడ్ లో మంచి పేరు సంపాదించుకున్న సంజనా రెడ్డి ఈ సినిమాని తెరకెక్కించనున్నారు. తెలుగుతో పాటు ఇతర భాషలోను ఈ బయోపిక్ ని రూపొందించే దిశగా కోన వెంకట్ ప్రయత్నాలు చేస్తున్నారట. ఈ సినిమా తర్వాత కోన వెంకట్ దర్శాకుడిగా మారడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు.   

మరింత సమాచారం తెలుసుకోండి: