సూపర్ స్టార్ మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు బ్లాక్ బస్టర్ అందుకున్న 6 నెలల గ్యాప్ తర్వాత తన 27 వ సినిమాని ప్రకటించాడు. మే 31 న సర్కారు వారి పాట అన్న టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేసి మహేష్ బాబు  సంచలనం సృష్టించాడు. గీత గోవిందం ఫేం పరశురాం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని జీ.ఎం.బి ఎంటర్‌టైన్‌మెంట్స్, 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్, మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ లో ఫుల్ ఫాం లో ఉన్న థమన్ ఈ సినిమాకి సంగీతమందిస్తున్నాడు.  

 

IHG

 ఇక సర్కారు వారి పాట ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన 24 గంటల్లో ముందెన్నడు లేని విధంగా సోషల్ మీడియాలో అత్యధిక వ్యూస్ ని సాధించి రికార్డ్ సాధించింది. ఒక్క ఫస్ట్ లుక్ తోనే ఈ స్థాయి రికార్డ్ సాధించడంతో మహేష్ అభిమానులతో పాటు ఇండస్ట్రీ వర్గాల్లోను అప్పుడే ఈ సినిమా మీద భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఇక రీసెంట్ గా ప్రభుత్వం షూటింగ్స్ కి అనుమతులివ్వడంతో ఎప్పుడెప్పుడు షూటింగ్స్ మొదలు పెడతారా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 

 

IHG

ఈ నేపథ్యంలో సర్కారు వారి పాట డిసెంబర్ లో మొదలవుతుందని అప్పటి వరకు ఛాన్సే లేదన్న వార్తలు సోషల్ మీడియాలో వస్తున్నాయి. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాని ఆగస్టు రెండవ వారం నుండి సెట్స్ మీదకి తీసుకెళ్ళేందుకు మేకర్స్ షెడ్యూల్స్ ప్లాన్ చేస్తున్నారట. అంతేకాదు సెట్ లో కూడా ఆర్టిస్టులు ..టెక్నీషియన్స్ ఎంత వరకు అవసరమో అంతవరకే తీసుకోవాలని ఖచ్చితంగా నిర్ణయించుకున్నారట. ఒకవేళ ఆగస్టు వరకు కరోనా ప్రభావం తీవ్రంగా ఉండటం లేదా వర్షాలు ఎక్కువగా పడటం జరిగితే అక్టోబర్ లో మొదలుపెట్టేలా సన్నాహాలలోను ఉన్నారట.

 

IHG

అంతేగాని డిసెంబర్ వరకు ఆగరని విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం. అయితే ముఖ్యంగా మహేష్ నిర్మాణ వ్యయం ఏమాత్రం పెరగకుండా తొందరపడి అనవసరంగా బడ్జెట్ పెరగకుండా జాగ్రత్త పడాలని ప్రస్తుతం ఉన్న పరిస్థితులని బట్టి సూచించాడట. ఎంతవరకు వీలైతే అంత ఖచ్చితమైన బడ్జెట్ తోనే సినిమా నిర్మాణ వ్యయం ఉండేలా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పాడట. రానున్న రోజుల్లో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఎదుర్కొనేలా ఉండాలని చెప్పినట్టు సమాచారం. మొత్తానికి సినిమా గురించి నిర్మాత గురించి మహేష్ ఇంత జాగ్రత్తగా వ్యవహరించడం ఇప్పుడు అందరిని ఆశ్చర్య పరుస్తోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: