టాలీవుడ్ లో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా రౌద్రం రణం రుథిరం. దాదాపు 400 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాని డివివి దానయ్య నిర్మిస్తున్నారు. దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ మెగా పవర్ స్టార్ రాం చరణ్ హీరోలుగా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్, సీనియర్ స్టార్ హీరో అజయ్ దేవగన్, బ్రిటన్ మోడల్ ఓలియా మోరెస్ తో పాటు మరికొందరు బాలీవుడ్ హాలీవుడ్ నటులు నటిస్తున్నారు.

 

IHG

అయితే ఇంత భారీ కాన్వాయిస్ తో తెరకెక్కిస్తున్న ఈ సినిమా కి ఇండస్ట్రీలో మిగతా సినిమాల కంటే రెండింతలు సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటికే అనుకున్న బడ్జెట్ కంటే భారీగా ఖర్చు పెరిగిందని చర్చలు జరుగుతున్నాయి. ఆ బడ్జెట్ ని తిరిగి ఎలా రాబట్టుకోవాలన్న ఆలోచనలే మేకర్స్ కి ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటికే ఆరు నెలలు సినిమా పోస్ట్ పోన్ అయిందంటేనే నిర్మాతలు హడలిపోతున్నారు. ఎప్పటిలాగే సాధారణ  పరిస్థితులున్నాయి...సినిమా రాజమౌళి మ్యాజిక్ తో పెట్టిన పెట్టుబడి తిరిగి వచ్చేస్తుంది అనుకునే అవకాశాలు ఇప్పుడు ఎంతమాత్రం లేదు.

 

 

IHG's 'RRR' team makes big reveals, <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=HEROINE' target='_blank' title='heroine-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>heroine</a> and antagonists ...

కాని కరోనా విజృంభణ విస్తృతంగా ఉన్న నేపథ్యంలో అనుమతులు ఇచ్చిన షూటింగ్స్ జరపాలంటే అంత ఈజీ కాదని ఇప్పుడు అర్థమవుతోంది. ఈ నేపథ్యంలో ఇపుడు బాలీవుడ్ నటులు గాని హాలీవుడ్ నటులు గాని ఇప్పుడు గాని వచ్చి షూటింగ్ లో జాయిన్ అయ్యో పరిస్థితులు లేవు. దాంతో ఆర్.ఆర్.ఆర్ షూటింగ్ పనులు ఇంకా ఆలస్యం అవుతాయని ఇప్పుడు వినిపిస్తుంది. ఈ ప్రభావం మళ్ళీ 2021 సంక్రాంతి కి రిలీజ్ మీద పడుతుందని సమాచారం. అంతేకాదు కరోనా ప్రభావం ఇలాగే ఉంటే సినిమా రిలీజ్ చేసినా థియోటర్స్ కి జనాలు రావడం కష్టమని తెలుస్తుంది.

 

IHG'Mahanati' <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=DIRECTOR' target='_blank' title='director-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>director</a> Nag Ashwin ...

ఒకవైపు బడ్జెట్ భారీగా పెరిగిపోతుంది. మరి ఇలాంటి క్లిష్ఠ పరిస్థితుల్లో ఆర్.ఆర్.ఆర్ కి పెట్టిన పెట్టుబడి ఎంతవరకు తిరిగి వస్తుందో అన్న అనుమానాలు చాలామందిలో మొదలయ్యాయట. మరి ఈ సినిమా ఉదాహరణతో అయినా ఇండస్ట్రీలో అతిగా బడ్జెట్ ని పెట్టకుండా కంట్రోల్ చేస్తారా లేదా అన్నది చూడాలి. అంతేకాదు కనీసం 2022 వరకైనా భారీ బడ్జెట్ సినిమాల జోలికి వెళ్ళకపోతే మంచిది అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: