టాలీవుడ్ ఇండస్ట్రీలో అతి పెద్ద బ్యానర్లలో ఒక బ్యానర్ గీతాఆర్ట్స్. ఈ సంస్థ ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా పెద్ద పెద్ద సినిమాలు రిలీజ్ అవటం బాక్సాఫీసు దగ్గర భారీ విజయాలు నమోదు చేసుకోవటం అందరికీ తెలిసిందే. అల్లు అరవింద్ సారథ్యంలో నడిచే ఈ బ్యానర్ లో కీలకపాత్ర బన్నీ వాసు పోషిస్తుంటారు. చాలా వరకు సినిమాల ఎంపిక అల్లు అరవింద్ ఉన్నాగాని బ్యానర్ యొక్క కీలక పనులు బన్నీవాసు ఏ చూసుకుంటాడు. గత ఏడాది ‘ప్రతి రోజూ పండగే’తో భారీ విజయాన్నందుకున్న గీతా ఆర్ట్స్ ఈ ఏడాది ప్రారంభంలో సంక్రాంతి పండుగ సందర్భంగా నిర్మించి రిలీజ్ చేసిన ‘అల వైకుంఠపురములో’ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ నమోదు చేసుకున్నారు.

 

మహమ్మారి కరోనా వైరస్ రాకుండా ఉంటే ఈ ఏడాది వేసవి లోనే గీతా ఆర్ట్స్ బ్యానర్ సారథ్యంలో తెరకెక్కిన అక్కినేని అఖిల్ నటించిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ వేసవి కాలం లో రిలీజ్ అయి ఉండేది. అంతేకాకుండా  ‘చావు కబురు చల్లగా’, ‘18 పేజెస్’ ఇలాంటి చిన్న సినిమాలు కూడా ఈ ఏడాది రిలీజ్ అయే ఉండేది. కరోనా వైరస్ రాకతో థియేటర్లు క్లోజ్ అవ్వటంతో వచ్చే ఏడాది బాక్సాఫీస్ గీతా ఆర్ట్స్ బ్యానర్ కి సంబంధించిన సినిమాల హడావిడి మామూలుగా ఉండదని తాజాగా బన్నీవాసు చెప్పుకొచ్చారు.

 

ఇప్పుడు థియేటర్ లు క్లోజ్ అవటం వల్ల నష్టం ఏమీ ఉండదని..వచ్చే ఏడాది మొత్తాన్ని సినీ పరిశ్రమ రికవర్ చేసుకోవటం గ్యారెంటీ అని బన్నీ వాసు అన్నారు. లాక్ డౌన్ కారణంగా జనాలు ఇంటికే పరిమితమయ్యారు వచ్చే ఏడాది ఎటువంటి సమస్యలు ఉండవు పైగా వ్యాక్సిన్ కూడా వచ్చే అవకాశాలు ఉండటంతో...రాబోయే 2021 ఏడాది పెద్ద ఎత్తున బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ వ్యాపారం జరిగే అవకాశం ఉంది అన్నట్టుగా బన్నీవాసు అంచనా వేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: