తెలుగులో అమృతరామమ్ తర్వాత డైరెక్ట్ గా ఓటిటి లో విడుదలకానున్న రెండో చిన్న సినిమా ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య. కేవలం 2.5 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈచిత్రం థియేటర్ రిలీజ్ లేకుండా డైరెక్ట్ గా డిజిటల్ రిలీజ్ కానుంది. త్వరలోనే  ప్రముఖ ఓటిటి నెట్ ఫ్లిక్స్ ఈసినిమాను స్ట్రీమింగ్ లోకి తీసుకురానుంది. ఇందుకోసం నెట్ ఫ్లిక్స్ 4కోట్లు చెల్లించిందట. ఇక శాటిలైట్ హక్కులు కూడా మూడు కోట్లకు అమ్ముడయ్యాయట. దాంతో నిర్మాతలకు ఈసినిమా  ద్వారా 3కోట్ల వరకు లాభాలు వచ్చాయి. 

 

మొదటి సినిమా కేరాఫ్ కంచరపాలెంతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న యంగ్ డైరెక్టర్ వెంకటేష్ మహా తెరకెక్కించిన ఈ చిత్రంలో సత్యదేవ్ హీరోగా నటించగా నరేష్ , హరిచందన ,సుహాస్ కీలక పాత్రల్లో నటించారు. బాహుబలి సిరీస్ ను నిర్మించిన ఆర్కా మీడియా  ఈ సినిమాను నిర్మించడం విశేషం. ఇటీవలే ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుంది. బోర్డు  ఈచిత్రానికి క్లీన్ యు సర్టిఫికేట్ ఇచ్చింది. 

 
నిజానికి ఈసినిమా ఏప్రిల్17న థియేటర్లలో విడుదలకావాల్సివుండగా కరోనా వల్ల వాయిదాపడింది.  ఇప్పట్లో థియేటర్లు తెరుచుకొనే పరిస్థితి లేక పోవడంతో నిర్మాతలు డైరెక్ట్ గా ఓటిటి లో రిలీజ్ చేయాలని డిసైడ్ అయ్యారు. మళయాలం బ్లాక్ బాస్టర్ మూవీ మహేషింటే ప్రతీకారంకు రీమేక్ గా తెరకెక్కిన  ఈ చిత్రం ఎలాంటి  రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి. ఈసినిమా ఇంతకుముందు తమిళంలో కూడా రీమేక్ అయ్యింది. ఉదయనిధి స్టాలిన్ హీరోగా నటించగా ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్ తెరకెక్కించాడు. కాగా ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్యతో పాటు తెలుగు నుండి మరికొన్ని చిన్న సినిమాలు డైరెక్ట్ గా ఓటిటి లోకి విడుదలకావడానికి రెడీ అవుతున్నాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: