కొందరు హీరోయిన్లు అందంతో అవకాశాలను సంపాదిస్తారు. మరికొందరు హీరోయిన్లు అభినయంతో అవకాశాలను సొంతం చేసుకుంటారు. అందం, అభినయం రెండూ ఉన్న హీరోయిన్లు మాత్రమే ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎక్కువ కాలం హీరోయిన్ గా నిలదొక్కుకుంటారు. అలాంటి హీరోయిన్లలో బుట్టబొమ్మ పూజా హెగ్డే ఒకరు. చేసింది తక్కువ సినిమాలే అయినా స్టార్ హీరోల సరసన అవకాశాలు రావడంతో బుట్టబొమ్మ రేంజే మారిపోయింది. 

 

IHG

 

1990 సంవత్సరం అక్టోబర్ 13వ తేదీన జన్మించిన పూజా హెగ్డే 2010 మిస్ వరల్డ్ పోటీలలో రెండో స్థానంలో నిలిచింది. కర్ణాటకలోని మంగళూరులో పుట్టిన పూజా హెగ్డే మాతృ భాష తుళు, కన్నడ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో అనర్గళంగా మాట్లాడగలదు. 2012 సంవత్సరంలో తమిళంలో మూగమూడి అనే సినిమాతో పూజా హెగ్డే సినీ కెరీర్ ప్రారంభమైంది. 2014లో ఒక లైలా కోసం సినిమాతో బుట్టబొమ్మ టాలీవుడ్ కు పరిచయమైంది. 

 

IHG

 

ఆ తరువాత ముకుంద సినిమాలో నటించిన పూజాకు ఆ పాత్ర మంచిపేరు తెచ్చిపెట్టింది. బాలీవుడ్ లో మొహంజోదారో సినిమాలో పూజా నటించినా ఆ సినిమా డిజాస్టర్ ఫలితాన్ని అందుకోవడంతో బాలీవుడ్ లో అవకాశాలు రాలేదు. అనంతరం టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ల సరసన అవకాశాలు రావడం... ఆ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లు కావడంతో పూజాకు స్టార్ హీరోయిన్ గా గుర్తింపు వచ్చింది.

 

IHG

 

2017లో అల్లు అర్జున్, పూజా హెగ్డే కాంబినేషన్ లో తెరకెక్కిన దువ్వాడ జగన్నాథం బ్లాక్ బస్టర్ హిట్ కాకపోయినా పూజా అందచందాలకు మంచి మార్కులే పడ్డాయి. అనంతరం రంగస్థలం సినిమాలో స్పెషల్ సాంగ్ చేసిన పూజాకు ఆ పాట మంచిపేరు తెచ్చిపెట్టింది. బెల్లంకొండ సరసన నటించిన సాక్ష్యం సినిమా ఫ్లాప్ అయినా అరవింద సమేత వీరరాఘవ, మహర్షి, అల వైకుంఠపురములో సినిమాలు బుట్టబొమ్మ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్స్ గా నిలిచాయి. ప్రస్తుతం పూజా ప్రభాస్ కు జోడీగా రాధాకృష్ణ దర్శకత్వంలో నటిస్తున్నారు. అందం, అభినయంతో వరుస విజయాలు అందుకున్న పూజా మరెన్నో విజయాలు అందుకోవాలని ఆశిద్దాం.

మరింత సమాచారం తెలుసుకోండి: