ఏంటి నిజామా? అంత ఘోరమైన హీరోయిన్ ఎవరు ఉన్నారు అబ్బా? అని అనుకుంటున్నారు కదా! ఘోరం కాదు కానీ.. వారు అచ్చమైన ఆడపిల్లలు. చూస్తే వావ్ అనిపించే తెలుగింటి ఆడపిల్లలు. వారి స్వస్థలం ఏది అయినా వారు సినిమాల్లో కనిపించే పద్ధతి మాత్రం తెలుగు అమ్మాయి పద్దతే. అందుకే కొందరు ఏక్సపోజింగ్ చెయ్యకపోయినా ప్రేక్షకులకు బాగా దగ్గరవుతారు. 

 

IHG

 

నివేద థామస్.. తీసింది 5 సినిమాలు.. కానీ అందరి గుండెల్లో ఉంది. మంచి నటన.. మంచి అందం. ఫ్యామిలీ డ్రామాస్, యాక్షన్ ఫిల్మ్స్, డిటెక్టీవ్ ఫిల్మ్స్ వరకు ఓకే కానీ బికినీ వేస్తే.. ఎహే అసలు ఉహించుకోలేం. 

 

IHG

 

నిత్యామీనన్.. నిత్యామీనన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆమె తీసిన సినిమాలు అలా ఉన్నాయి. ఈమెకూడా ప్రత్యేకమైన పాత్రలకు సెట్ అవుతుంది కానీ బికినీకి అసలు కాదు.  

 

IHG

 

అనుపమ.. చిన్న పిల్లలా ఉంటుంది.. ఇంకా బికినీ వేస్తే అసలు చూడగలరా! ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనుపమ కూడా. మన తెలుగమ్మాయి.  

 

IHG

 

సాయి పల్లవి.. నటన బాగుంటుంది.. డ్యాన్స్ బాగుంటుంది.. కానీ హీరోయిన్ గానే సెట్ అవ్వదు అన్నారు. అయితే ఏక్సపోజింగ్ పాత్రలకు సెట్ అవ్వదు.. తెలుగింటి అమ్మాయిల పాత్రలో అయితే అందరిని ఫిదా చేసేస్తోంది.. తెలుసు కదా! ఒక్కటే పీస్.. హైబ్రిడ్ పిల్లా! 

 

IHG

 

కీర్తి సురేష్.. మహానటి.. సావిత్రి గారిలా ఉహించుకున్నాక ఈమెని బికినిలో ఎవరు మాత్రం చూడగలరు. మంచి కాఫీ లాంటి సినిమాలలో హీరోయిన్ గా అయితే చూడగలం. 

మరింత సమాచారం తెలుసుకోండి: