‘అల వైకుంఠపురములో’ ఇండస్ట్రీ హిట్ గా మారడం వెనుక బన్నీ పిఆర్ టీమ్ వ్యూహాత్మకంగా చేసిన పబ్లిసిటీ ఒక ప్రధాన కారణం అన్న అభిప్రాయాలు ఉన్నాయి. గత మూడు నెలలుగా షూటింగ్ లు లేక ఖాళీగా ఉంటున్న బన్నీ తనను తాను బాలీవుడ్ లో ప్రమోట్ చేసుకోవడానికి తన దగ్గర ఉన్న పిఆర్ టీమ్ సహకారంతో అనేక వ్యూహాలు రచిస్తూ బాలీవుడ్ లో కూడ తన ఇమేజ్ ని పెంచుకోవడానికి తన పిఆర్ టీమ్ సహకారంతో కొత్త వ్యూహాలు రచిస్తున్నాడు.


ఇలాంటి పరిస్థితులలో ఈ లాక్ డౌన్ సమయంలో కూడ నిబంధనలు పాటిస్తూ బన్నీ తన పిఆర్ టీమ్ లోని ఒకవ్యక్తి పుట్టినరోజు వేడుకలను తన ఇంటిలో నిరాడంబరంగా జరపడమే కాకుండా సామాజిక దూరం పాటిస్తూ బన్నీ తన పిఆర్ టీమ్ తో కలిసి ఉన్న ఫోటో ఇప్పుడు లీక్ అవ్వడంతో బన్నీ తన పిఆర్ టీమ్ ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నాడో అర్ధం అవుతుంది. ప్రస్తుతం టాప్ యంగ్ హీరోలు తాము నటిస్తున్న సినిమాల కథలు దర్శకుల విషయంలో ఎంత శ్రద్ధ వహిస్తున్నారో తమ పిఆర్ టీమ్ ను మెయిన్ టైన్ చేయడంలో కూడ అంత శ్రద్ధ వహిస్తున్నారు.


తాను నటించే సినిమాల లుక్ దగ్గర నుండి ఆ సినిమాలోని తన కాస్ట్యూమ్స్ వరకు ఎంతో శ్రద్ధ తీసుకునే బన్నీ తన పిఆర్ టీమ్ ను ఎంపిక చేసే విషయంలో కూడ చాల జాగ్రత్తలు తీసుకుంటూ చాల వ్యూత్మకంగా వ్యవహరిస్తాడని అతడి సన్నిహితులు అంటారు. లేటెస్ట్ గా నటిస్తున్న ‘పుష్ప’ మూవీని పాన్ ఇండియా మూవీగా మార్చి బన్నీ బాలీవుడ్ లో కూడ తన సత్తా చాటుకోవాలన్న ఆలోచనలతో ప్రస్తుతం బన్నీ పిఆర్ టీమ్ లో బాలీవుడ్ కు చెందినా టీమ్ కూడ చేరడమే కాకుండా మరింత సమర్థవంతంగా దక్షిణాదిలో అల్లు అర్జున్ ను ప్రమోట్ చేయడానికి చాల ప్రయత్నాలు ఇప్పటికే మొదలయ్యాయి. దీనితో చాలామంది టాప్ హీరోలు బన్నీ పిఆర్ గ్యాంగ్ కు సమంధించిన వార్తలు విని అలాంటి గ్యాంగ్ ను తాము కూడ ఏర్పరుచుకోవాలని గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లు టాక్..

మరింత సమాచారం తెలుసుకోండి: