కరోనా ప్రభావంతో అన్ని రంగాలలోను మార్పులు వస్తున్నట్లుగానే సినిమా నిర్మాణంలో అదేవిధంగా సినిమా బడ్జెట్ విషయంలో అనేకమార్పులు వస్తున్నాయి. ఇప్పటివరకు టాప్ హీరోల సినిమాలు అంటే చాలు కోట్లాది రూపాయలను చిత్తు కాగితాలులా ఖర్చుపెట్టిన నిర్మాతలకు కరోనా పరిస్థితులు వల్ల జ్ఞానోదయం కలిగి ఈమధ్యనే సినిమా స్టార్స్ దర్శకులు అందరూ తమ పారితోషికాలు తగ్గించుకోవాలి అంటూ ప్రొడ్యూసర్స్ గిల్డ్ తరపున పిలుపు ఇచ్చిన విషయం తెలిసిందే.


అయితే ఈపిలుపుకు ఇప్పటి వరకు టాప్ హీరోల వద్దనుండి కాని టాప్ దర్శకుల వద్ద నుండి కాని ఇంకాఎటువంటి స్పందన రాలేదు. అయితే ఎవరు ఊహించని విధంగా దర్శకుడు పరుశు రామ్ మహేష్ తో తాను త్వరలో మొదలుపెట్టబోతున్న ‘సర్కారు వారి పాట’ మూవీకోసం తన పారితోషికంలో 30 శాతం కోత విధించుకుంటున్నట్లు తనకు తానుగా ఈమూవీ నిర్మాతలకు చెప్పాడు అని వస్తున్న వార్తలు షాకింగ్ న్యూస్ గా మారాయి.


‘గీత గోవిందం’ సూపర్ సక్సస్ తరువాత పరుశు రామ్ రేంజ్ పెరగడంతో అతడికి 10 కోట్లకు పైగా ఆఫర్లు రావడం మొదలైంది. దీనితో మహేష్ తో సినిమాను తీసుస్తున్న మైత్రీ మూవీస్ సంస్థ నిర్మాతలు కూడ పరుశు రామ్ కు పారితోషికంగా 10 కోట్ల పారితోషికాన్ని ఫైనల్ చేద్దాము అని అనుకున్నారు అని టాక్. అయితే పరుశు రామ్ తనకు తానుగా తన పారితోషికంలో కోత విధించుకుని ట్రెండ్ సెటర్ గా మారాలని చేసిన ప్రయత్నాలు వల్ల ఇప్పుడు ఇండస్ట్రీ టాప్ దర్శకులకు ఊహించని సమస్యలు ఏర్పడ్డాయి అనితెలుస్తోంది.


ముఖ్యంగా త్రివిక్రమ్ జూనియర్ ల కాంబినేషన్ లో ప్రారంభం కాబోతున్న మూవీకి భారీ పారితోషికం అడగాలని త్రివిక్రమ్ ఆలోచనలు చేసినట్లు టాక్. అదేవిధంగా చిరంజీవితో కొరటాల తీస్తున్న మూవీకి బన్నీతో సుకుమార్ మూవీకి బాలకృష్ణతో బోయపాటి తీస్తున్న మూవీల విషయంలో కూడ వీరందరికీ భారీ పారితోషికాలు ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇలాంటి పరిస్థితులలో పరుశు రామ్ పద్ధతిని అనుసరించమని టాప్ దర్శకుల పై ఒత్తిడి పెరిగే ఆస్కారం ఉంది అంటూ ఇండస్ట్రీవర్గాలలో కామెంట్స్ వినిపిస్తున్నాయి.. 

మరింత సమాచారం తెలుసుకోండి: