దర్శకధీరుడు రాజమౌళి తన కలల ప్రాజెక్టు మహాభారతం అని చెప్పేశాడు. ఎప్పటికైనా మహాహారతం సినిమాని ఖచ్చితంగా వెండితెర మీద చూపిస్తానని చెప్పిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆర్.ఆర్.ఆర్ పనుల్లో ఉన్న రాజమౌళి, ఆ తర్వాత మహేష్ బాబు హీరోగా సినిమా ఒప్పుకున్నాడు. అంటే రాజమౌళి మహాభారతం ఇప్పట్లో ఉండదని అర్థమైపోయింది. అయితే ఆ విషయంలో ఎలాంటి బాధపడాల్సిన అవసరం లేదని అంటున్నారు.

 

 

ఎందుకంటే మరికొద్ది రోజుల్లో మహాభారతం బాలీవుడ్ లో తెరకెక్కబోతుందట. మిస్టర్ పర్ ఫెక్షనిస్టుగా పేరొందిన ఆమీర్ ఖాన్ మహాభారతాన్ని తెరకెక్కించాలని భావిస్తున్నాడట. గతంలోనే మహాభారతం పట్ల ఆసక్తి తెలియజేసిన ఆమీర్, ఈ సారి తన డ్రీమ్ ప్రాజెక్టుని పూర్తి చేయాలని అనుకుంటున్నట్లు సమాచారం. ఇందుకోసం బాహుబలి రచయిత విజయేంద్రప్రసాద్ ని స్క్రిప్టు రాయమన్నట్లు తెలుస్తుంది.

 

 

 


రాజమౌళి ప్రతీ చిత్రానికి కథా రచయితగా పనిచేసే విజయేంద్రప్రసాద్, ఇటు తెలుగులోనే కాకుండా హిందీ, తమిళ చిత్రాలకి కూడా కథలని అందించాడు. అయితే ఇప్పుడు ఆమీర్ ఖాన్ మహాభారతం సినిమాకి కూడా స్క్రిప్టు రాయనున్నాడని అంటున్నారు. ఈ విషయమై ఆమీర్ ఖాన్ విజయేంద్రప్రసాద్ ని అడిగినట్లు సమాచారం. విజయేంద్రప్రసాద్ అందుకు ఒప్పుకున్నడని అంటున్నారు.

 

 


ఈ విషయమై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అయితే మహాభారతంలో ఆమీర్ ఖాన్ ఏ పాత్రలో కనిపిస్తాడనేది ఆసక్తిగా మారింది. ఇటు పాండవుల పాత్రలు గానీ, కౌరవుల పాత్రలు గానీ ఆమీర్ కి సెట్ అవ్వవు. కాబట్టి అయితే క్రిష్ణుడిగానో, లేదంటే కర్ణుడిగానో వేయాల్సి ఉంటుంది. మరి ఆమీర్ ఖాన్ ఏ పాత్ర తీసుకుంటాడో చూడాలి. ప్రస్తుతం ఆమీర్ ఖాన్ లాల్ సింగ్ ఛడ్డా అనే సినిమా చేస్తున్నాడు. మరి కొద్ది రోజుల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: