అలనాటి నటి సావిత్రి తర్వాత అంతటి పేరు సంపాదించుకున్న హీరోయిన్ సౌందర్య. తన అందంతో అభినయతో ప్రేక్షకుల మదిని గెలుచుకున్నది ఒక్క ఎత్తు అయితే.. ఆమె కట్టు బొట్టుతో ప్రేక్షకుల మది కొల్లగొట్టింది. చీర కట్టులో ఆమె దివి నుంచి భువిపైకి వచ్చిన దేవతల కనపడేది ఈ కన్నడ భామ. అగ్ర హీరో సినిమా అయినా చిన్న హీరో సినిమా అయినా సరే హీరో పక్కన హైలెట్ అయ్యేది కచ్చితంగా సౌందర్య అనేది వాస్తవం. ఆ విధంగా ఆమె తన నటన తో అందం తో ఆకట్టుకున్నారు. వెంకటేష్ పక్కన చేసిన సినిమాల్లో ఆమె చీర కట్టు చూసి ఎందరో ప్రేక్షకులు షాక్ అయ్యారు. 

 

 

ఆమె చీర కట్టు చూసి తెలుగుదనం ఉట్టిపడినట్టు ఉందీ అంటూ కామెంట్ లు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి అనేది వాస్తవం. తెలుగు సినిమా అయినా తమిళ సినిమా అయినా సరే ఆమె ఉంటే అదో రేంజ్ అని అనుకునే వారు ప్రేక్షకులు. ఆమె నాగార్జున చిరంజీవి, బాలకృష్ణ ఇలా చాలా మంది హీరోల సినిమాల్లో నటించారు. చాలా కీలక పాత్రలు పోషించారు. కొందరు హీరోల పక్కన ఆమె అలా అతికినట్టు సరిపోయే వారు అనేది అందరికి తెలిసిన విషయమే. జగపతి బాబు, వెంకటేష్ సినిమాల్లో అయితే ఆమె అసలు మరో హీరోయిన్ కి అవకాశం లేదు అన్నట్టు ఉండే వారు. 

 

 

ఆమె సినిమాల్లో ఆమె నటన ఆమె అందం ఆమె మాట తీరు ఆమె చూపులు ఆమె నడవడిక అన్నీ కూడా హైలెట్ అవుతూ ఉండేవి అనేది వాస్తవం. ఆమె చేసిన పాత్రలు గాని ఆమె పోషించిన కొన్ని పాత్రలు గాని మరొకరు చేయలేరు అనేది వాస్తవం. ఆ విధంగా ఆమె నిలబడ్డారు. ఆమె మరణం తర్వాత చాలా మంది ఆమె ఫోటోలు తమ ఇంట్లో పెట్టుకున్న సందర్భం కూడా ఉంది అంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: