డాక్టర్ చదువుకొన్న సాయి పల్లవి యాక్టర్ అయ్యింది కానీ అందరి హీరోయిన్ల లాగా ఎక్స్పోజింగ్ చేయడానికి ఒప్పుకోనని, సెక్స్, లిప్ కిస్ లు లాంటి సన్నివేశాల్లో అస్సలు నటించనని స్పష్టం చేసింది. స్క్రిప్ట్ కిస్సింగ్ సన్నివేశాలను డిమాండ్ చేసినా... ఆమె మాత్రం కిస్సింగ్ సీన్లలో నటించేందుకు ససేమిరా అంటుంది. గ్లామర్ షో చేసేందుకు ఇష్టపడని సాయిపల్లవి ఎంతో మంది స్టార్ హీరోల సినిమాలను రిజెక్ట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ప్రస్తుత కాలంలో సాయి పల్లవి లాంటి హీరోయిన్లు చాలా అరుదుగా ఉన్నారని చెప్పుకోవచ్చు. 


ఎంతో కొంత డబ్బులు సంపాదించడానికి ఎటువంటి పాత్రల్లోనైనా నటించేందుకు బడా స్టార్ హీరోయిన్లు కూడా సిద్ధం అవుతున్నారు కానీ ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా మొన్నీమధ్య సినీ పరిశ్రమలో తెరంగేట్రం చేసిన సాయి పల్లవి మాత్రం కోట్ల రూపాయల ఆఫర్ ను ఈజీ గా వదులుకుంటూ ఇతర హీరోయిన్లందరికీ స్ఫూర్తిదాయకం అవుతుంది. తనకు ఏ సినిమా ఆఫర్లు రాకపోయినా పర్వాలేదు అని, కావాలంటే సినీ ఇండస్ట్రీకి స్వస్తి చెప్పి డాక్టర్ వృత్తిలో కొనసాగుతాను కానీ పొట్టి పొట్టి డ్రెస్సులు ధరించి తన ఆత్మాభిమానాన్ని చంపుకొనంటుంది సాయి పల్లవి. 


ఈమెకు ఫిదా సినిమా ద్వారా బాగా పాపులారిటీ వచ్చింది అని అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో కూడా ఆమె స్క్రిప్ట్ డిమాండ్ చేసినా... మోకాళ్ల వరకు మాత్రమే స్కిన్ షో చేసేట్టు వెస్ట్రన్ డ్రెస్స్ ధరించింది కానీ మరీ ఎక్కువగా ఎక్స్పోజింగ్ చేయలేదు. ఐతే వెస్ట్రన్ డ్రెస్స్ లో కూడా ఆమె చాలా అందంగా కనిపించింది. బడా స్టార్ ధనుష్ హీరోగా నటించిన మారి 2 చిత్రంలో ఆమె సాంప్రదాయకంగా నే కనిపించింది. పడి పడి లేచే మనసు చిత్రంలో శర్వానంద్ సరసన నటించిన సాయి పల్లవి సాంప్రదాయిక వస్త్రములను ధరించి తెలుగు ప్రేక్షకులను బాగా అలరించింది. ఏదేమైనా నాచురల్ గా, నాజూకుగా కనిపించే సాయి పల్లవి ఏ డ్రెస్స్ వేసుకున్నా చాలా అందంగా కనిపిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: