లేడీ సూపర్ స్టార్ గా పేరొందిన నయనతార చీరకట్టులో అయినా, బికినీలలో ఐనా చాలా అందంగా కనిపిస్తుంది. చాలా సినిమాలలో నయనతార చీరకట్టు అందాలతోనే అందరినీ మెప్పించింది. తులసి, సింహ, చంద్రముఖి, బాస్, సైరా నరసింహారెడ్డి, శ్రీరామరాజ్యం వంటి సినిమాలలో చాలా సాంప్రదాయంగా చీర కట్టుకొని బంగారు నగలు ధరించి అందం అంటే తనే నేమో అనేలా చేసింది. అజిత్ బిల్లా, వల్లభ వంటి చిత్రాలలో శృంగారభరితమైన పాత్రలలో బీభత్సంగా ఎక్స్పోజింగ్ చేస్తూ ప్రేక్షకులకు మత్తెక్కించింది. 

IHG
ఆమె నటించిన సినిమాలను చూస్తే... సాంప్రదాయక వస్త్రాలలో అయినా, బికినీలలో అయినా నయనతార అందానికి ఎవరైనా ఫిదా కావాల్సిందేనని అర్థమవుతుంది. లేడీ ఓరియంటెడ్ చిత్రాల్లో కూడా నటించి ప్రేక్షకుల విమర్శకుల మన్ననలు పొందింది. తను ఇండస్ట్రీలో అరంగేట్రం చేసి ఎన్నో సంవత్సరాలు అవుతున్నప్పటికీ స్టార్ హీరోయిన్ గానే కొనసాగుతున్నది. 35 ఏళ్ల వయసులో కూడా ఆమెకు హీరోయిన్ అవకాశాలు దన్నుకొస్తున్నాయంటే ఆమె అందం ఇంకా చెక్కుచెదర లేదని చెప్పుకోవచ్చు. 

IHG
ప్రస్తుతం ఆమె ముఖ్తి అమ్మాన్‌ అనే సినిమాలో అమ్మవారి పాత్రలో నటిస్తోంది. ఈ సినిమాకి సంబందించిన కొన్ని చిత్రాలు ఇటీవల నెట్టింట దర్శనమిచ్చాయి. నిజానికి ఈ సినిమా దర్శకుడు ఆర్జే బాలాజీ నయనతార అమ్మవారు రూపంలో ఉన్న చిత్రాలను విడుదల చేశాడు. అయితే నయనతార దేవత రూపంలో అద్భుతంగా ఉందని నెటిజనులు తెగ చర్చించుకున్నారు. దీన్ని బట్టి చూస్తుంటే నయనతార ఎటువంటి డ్రెస్స్ వేసుకున్నా... ప్రశంసలు, పొగడ్తలు తప్ప విమర్శలు అస్సలు రావని చెప్పుకోవచ్చు. 

IHG

35 ఏళ్ల వయసులో కూడా ఆమె ఫిట్నెస్ 18 ఏళ్ళ అమ్మాయిల ఉందంటే... ఆమె ఎంతగా కష్టపడుతుందో అర్థం చేసుకోవచ్చు. ఏదేమైనా ఆమె చక్కని రూపం, నటనా చాతుర్యం దక్షిణాది ప్రేక్షకులను బాగా ఎంటర్టైన్ చేస్తున్నాయని చెప్పుకోవచ్చు. పలు సినీ ప్రముఖులతో రిలేషన్ షిప్ లో ఉండి ఆ తర్వాత అందరితో తెగతెంపులు చేసుకున్న నయనతార ప్రస్తుతం దర్శకుడు విఘ్నేశ్ శివన్ తో ప్రేమాయణం కొనసాగిస్తుంది. వీళ్లిద్దరు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారనేది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: