సాధార‌ణంగా హీరోయిన్లు మొద‌ల కాస్త ప‌ద్ద‌తిగా కనబడుతూ…. రాను రాను అందాల ఆరబోతలో శృతి మించి పోతున్నారు. హీరోయిన్స్ అలా శృతి మించడానికి వారికుండాల్సిన కారణాలు వారికున్నాయి. ఇక ఇటీవ‌ల లిప్‌లాక్ సీన్లు, బికినీ పోజులు సినిమాల్లో ఎక్కువ‌గా ఉంటున్నాయి. హీరోయిన్లు కూడా అలాంటివన్నీ మామూలే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. అయితే కొంద‌రు మాత్రం కెరీర్ ఆరంభం నుంచీ సాంప్రదాయంగా, ఎక్స్‌పోజింగ్‌కు దూరంగా ఉంటూ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటారు. 

IHG

ఆ లిస్ట్‌లో అనుపమ పరమేశ్వరన్ కూడా ఒక‌రు. ప్రేమమ్ అనే చిత్రం ద్వారా మలయాళ సినిమాలకు పరిచయమైంది. ఆ త‌ర్వాత `అ ఆ` సినిమాతో తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లోకి అడుగు పెట్టిన ఈ ముద్దుగుమ్మ ఎంతో ప‌ద్ద‌తిగా ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. అ ఆ తరువాత అనుప‌మ‌కు చాల చిత్రాలలో అవకాశాలు వచ్చాయి. అనుపమ పరమేశ్వరన్‌ కేరీర్‌ ప్రారంభంలోనే దిల్ రాజు నిర్మాణంలో శర్వానంద్ హీరోగా `శతమానం భవతి` చిత్రంలో న‌టించి ఎందరో అభిమానులను తన సొంతం చేసుకుంది. 

IHG

అప్పటినుండి సినిమాల్లో తన స్పీడ్ పెంచింది. మరోపక్క సినిమాల్లోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా ఫుల్ ఫాలోయింగ్ పెంచుకుంది. అయితే గ్లామర్ డోస్ పెంచింది లేదు, హాట్ గా కనిపించింది లేదు. కానీ ఆమె నవ్వుకే చాలా మంది ఫిదా అయ్యారు. సింపుల్ గా కనిపిస్తూనే అందరిని ఆకర్షించే ఈ ముద్దుగుమ్మ ఎక్స్‌పోజింగ్‌కు చాలా దూరం. కేవ‌లం అందం, అభినయంతో తెలుగు, తమిళం, మళయాళ భాషల్లో ఎంతోమంది అభిమానులు, ఫాలోవర్లను సంపాదించుకున్న ఈ అందాల భామ హద్దులు దాటకుండా నటించేందుకు మాత్రమే ఇష్టపడుతుంది. 

IHG

మ‌రి అలాంటి అనుప‌మ బికినీలో క‌నిపిస్తే.. అస్స‌లు చూడ‌గ‌మా..? అంటే అస్స‌లు చూడ‌లేమ‌నే చెప్పాలి. ఎందుకంటే.. చాలా మంది చిన్న చిన్న దుస్తుల్లోనే అందంగా కనిపిస్తార‌ని అనుకుంటారు. కానీ అది కరెక్ట్ కాదు. అందం వేసుకునే బట్టలులో ఉండాలి తప్ప తక్కువ వేసుకుంటే అందంగా ఉన్నట్టు కాదు. ఇందుకు ఉదాహ‌ర‌ణ ‌అనుపమ పరమేశ్వరన్ అని చెప్పొచ్చు. బికినీ, మోడ్ర‌న్ డ‌స్సులు వేయ‌క‌పోయినా.. ఎక్స్‌పోజింగ్‌కు చేయ‌క‌పోయినా..  సాంప్రదాయంగానే ఎంద‌రో అభిమానుల‌ను ఆక‌ట్టుకుంది.


 

మరింత సమాచారం తెలుసుకోండి: