టాలీవుడ్ లో ఉన్న హ్యాండ్సమ్ హీరోల్లో గోపీచంద్ కు ప్రత్యేక స్థానం ఉంది. యాక్షన్ మూవీస్ కు సూటయ్యే పర్ఫెక్ట్ బాడీ బిల్డప్ తో గోపీచంద్ సొంతం. ఇప్పటి వరకూ చేసిన సినిమాలన్నీ యాక్షన్ నేపథ్యంలోనే. సక్సెస్.. ఫెయిల్యూర్స్ కు అతీతంగా కొనసాగుతున్న గోపీచంద్ కెరీర్లో ఓ సినిమా పూర్తైనా విడుదలకు నోచుకోలేదు. ఆ సినిమానే ‘ఆరడుగుల బుల్లెట్’. సీనియర్ దర్శకుడు బి.గోపాల్ దర్శకత్వం వహించిన ఈ మూవీ 2017లోనే పూర్తయింది. అయితే.. అనుకోని కారణాలతో ఈ సినిమా విడుదల ఆగిపోయింది. ఇప్పుడు ఈ సినిమాపై ఓ ఆసక్తికరమైన న్యూస్ ఇండస్ట్రీలో రౌండ్ అవుతోంది.

IHG

 

ఆరడుగుల బుల్లెట్ ను ఓటీటీ ప్లాట్ ఫామ్ లో విడుదల చేయాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. అనేక కారణాలతో విడుదలకు నోచుకోని ఈ సినిమాను ప్రస్తుత పరిస్థితుల్లో డిజిటల్ ప్లాట్ ఫామ్ సరైన వేదక అని భావిస్తున్నారని అంటున్నారు. ఇదే నిజమైతే ఓటీటీలో విడుదలయ్యే తొలి పేరున్న కాంబినేషన్ సినిమా అవుతుంది. ప్రస్తుతానికి గాసిప్ గా ఉన్న ఈ న్యూస్ పై మేకర్స్ నుంచి అఫిషియల్ న్యూస్ రావాల్సిందే. సినిమాలో గోపీచంద్ కు జోడీగా సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్ నయనతార నటించింది.

IHG

 

ఈ సినిమాను 2017 మే 19న విడుదలకు ప్రయత్నాలు జరిగాయి. అయితే.. ఫైనాన్షియల్ ప్రాబ్లెమ్స్ తో జూన్ 9కి మార్చారు. కానీ.. మరికొన్ని కారణాలతో సినిమా విడుదల జరగలేదు. దీంతో అప్పటినుంచి సినిమా విడుదలకు నోచుకోలేదు. జయ బాలాజీ రియల్ మీడియా బ్యానర్ పై తాండ్ర రమేశ్ ఈ సినిమాను నిర్మించారు. మణిశర్మ సంగీతం అందించారు. ప్రస్తుతం వస్తున్న గాసిప్స్ నిజమైతే ఇప్పటికైనా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. గోపీచంద్ అభిమానులు కూడా ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు.

IHG

 

మరింత సమాచారం తెలుసుకోండి: