2017వ సంవత్సరం లో షారుక్ ఖాన్ హీరోగా నటించిన రాయీస్ మూవీ ద్వారా కథానాయకిగా తెరంగేట్రం చేసిన పాకిస్థానీ మోడల్ మహీరా ఖాన్ తాజాగా ఇంస్టాగ్రామ్ లైవ్ లోకి పాల్గొని తన ప్రియుడి గురించి ఎన్నో ఆసక్తికర విషయాలను వెల్లడించింది. పాకిస్తాన్ డిజైనర్ హెచ్ఎస్ వై(HSY) తో ఇంస్టాగ్రామ్ లైవ్ ద్వారా ముచ్చటించిన మహీరా ఖాన్ తన ప్రియుడు సలీమ్ కరీం అని ఒప్పుకుంది. 


హెచ్ఎస్ వై ఆమెతో మాట్లాడుతూ మీ బాయ్ ఫ్రెండ్ సలీమ్ కళ్ళల్లోకి చూసినప్పుడు మొదటిగా మీకు ఏమి గుర్తొచ్చింది? అని ప్రశ్నించాడు. అప్పటి వరకూ తన బాయ్ ఫ్రెండ్ పేరుని గోప్యంగా ఉంచింది మహీరా ఖాన్. కానీ హెచ్ఎస్ వై తన ప్రియుడి పేరు అందరి ముందే చెప్పడంతో ఒక్కసారిగా షాక్ అయ్యి కాస్త ఇబ్బందిగా కూడా ఫీల్ అయ్యింది. ఆ తర్వాత తేరుకొని తన బాయ్ ఫ్రెండ్ గురించి అనేకమైన విషయాలను చెప్పింది. మొదటిలో తన ప్రేమాయణం గురించి వార్తల్లో, సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తాయని భయపడింది కానీ కొద్దిపాటి సమయం తర్వాత తన లవర్ గురించి తాను ఏమనుకుంటుందో చెప్పేసింది.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

" Pata nahi tum mujhe kis Naiki kay Badlay main Miley ho " #MahiraKhan finally first time opens up about love of her life " Salim Karim " during live interview with #HSY when he talks about Mohabbat and asked her " jab aap un ko dekhti hain aur un ki Ankhon main ankhain dal kar unhe dekhti hain tau aap kay dil aur Dimagh main kiya Khayal ata hai " and in reply Mahira quoted Humsafar's dialogue " pata nahi tum mujhe kis naiki kay badlay main mili ho " she praises him and talks about her feelings for him briefly . @mahirahkhan Video courtesy : @hassanhsy

A post shared by All pakistan Drama Page (@allpakdramapageofficial) on

మీ ప్రియుడు సలీం కళ్ళల్లో నేరుగా చూసినప్పుడు మీకు మొట్టమొదటిగా ఏమనిపించింది ఏం గుర్తొచ్చింది? అని ప్రశ్నించగా ఒక్కసారిగా షాక్ అయ్యి కాస్త ఇబ్బందిగా ఫీల్ అయిన ఆమె ఆ తర్వాత తేరుకొని... హమ్ సఫర్ సినిమాలో ఆషర్ ఖీరద్ కి చెప్పే 'ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నానో. ఇంత మంచి వ్యక్తి నాకు దొరికాడు' అని డైలాగ్ ఉంటుంది. అచ్చం ఇలానే నా  ప్రియుడి గురించి నేను అనుకుంటాను. నా జీవితంలో గొప్ప పని నేను ఏం చేశానో నాకు తెలియదు కానీ నేను ఏదో ఒక మంచి పని చేశాను కాబట్టే ఆ అల్లా దేవుడు నాకు సలీమ్ ని నా ప్రియుడిగా ప్రసాదించాడు', అని ఆమె చెప్పుకొచ్చింది. ఇకపోతే మహీరా ఖాన్ కి అలీ ఆస్కారి అనే ఓ వ్యక్తితో వివాహం కాగా... ఆమెకు ఒక కొడుకు, పేరు అజ్లం, కూడా జన్మించాడు. కొన్ని మనస్పర్థల వల్ల వారిద్దరూ పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: