ఓ పక్క హీరోయిన్ గా, మరోపక్క లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో.. తనదైన ముద్ర వేస్తోంది క్యూట్ బ్యూటీ కీర్తి సురేష్. ఈ మహానటి ఎంచుకునే సినిమాలు కూడా చాలా భిన్నంగా ఉంటున్నాయి. అందుకు ప్రస్తుతం ఆమె చేతిలో ఉన్న సినిమాలే అని చెప్పొచ్చు. 

 

మహానటి సినిమాతో ఎంతో గుర్తింపు తెచ్చుకుంది కీర్తి సురేష్. ఈ సినిమా విజయంతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న కీర్తి.. నటనాపరంగా మరో మెట్టు ఎక్కింది. మహానటికి గాను ఆమెకు జాతీయ ఉత్తమ నటి అవార్డు వరించింది. దాంతో కీర్తికి లేడీ ఓరియెంటెడ్ మూవీస్ క్యూకడుతున్నాయి. ప్రస్తుతం స్టార్ హీరోల పక్కన నటిస్తూనే.. ఫీమేల్ ఓరియెంటెడ్ ప్రాజెక్ట్స్ కీర్తి చేతిలో ఉన్నాయి. 

 

రజినీకాంత్ అన్నాతే, మోహన్ లాల్ నటిస్తున్న మరక్కార్, నితిన్ రంగ్ దే..లాంటి సినిమాలు చేస్తూనే, పెంగ్విన్, మిస్ ఇండియా, గుడ్ లక్ సఖీ.. సినిమాల్లో లీడ్ రోల్ పోషిస్తోంది. ఈ సినిమాలు కీర్తికి మరింత కీర్తిని తీసుకొస్తాయి అనడంలో.. ఎలాంటి సందేహం లేదంటున్నారు సినీ ప్రముఖులు. మిస్ ఇండియాలో మోడ్రన్ లుక్ లో కనిపించనున్న కీర్తి, గుడ్ లక్ సఖీలో.. బంజారా యువతిగా కనిపించనున్నారు. 

 

ఇక ఓటీటీ ప్లాట్ ఫామ్ ద్వారా జూన్ 19న.. పెంగ్విన్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది కీర్తి సురేష్. ఇటీవలే పెంగ్విన్ టీజర్ కూడా రిలీజ్ అయింది. ఈ టీజర్ క్రైమ్ ఎలిమెంట్.. మర్డర్ మిస్టరీ ఎలిమెంట్ తో ఉత్కంఠను కలిగిస్తోంది. కొడుకును కోల్పోయి వేదనకు గురయ్యే గర్భిణీగా కీర్తి సురేష్ నటిస్తోంది. ఈ థ్రిల్లర్ మూవీకి ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వం వహించారు. మరి అంచనాలను పెంగ్విన్.. కీర్తికి ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి. మొత్తానికి కీర్తి సురేష్ ఓ పక్క లేడీ ఓరియెంటెడ్ మూవీస్ తో.. మరోపక్క హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకతను చాటుకుంటోంది. 






మరింత సమాచారం తెలుసుకోండి: