తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రేక్షకులు కొంత మంది హీరోయిన్ ను  కేవలం కొన్ని లుక్స్  లో మాత్రమే చూడగలరు. అలా  ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా కాకుండా వేరే లుక్ లో కనిపించారు అంటే  ప్రేక్షకులు అస్సలు జీర్ణించుకోలేరు. కాజల్ అగర్వాల్ విషయంలో ప్రేక్షకులు ఇలాగే ఉంటారు. ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో చందమామ లాంటి హీరోయిన్ ఎవరూ అంటే టక్కున అందరూ కాజల్ అగర్వాల్ పేరు చెబుతారు అన్న విషయం తెలిసిందే. అయితే లక్ష్మీ కళ్యాణం సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన కాజల్ అగర్వాల్ తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ రేంజ్ పెరిగింది. 

 

 అయితే సినిమాలలో కాజల్ అగర్వాల్ కాస్త చిట్టి పొట్టి డ్రెస్సులు వేసినప్పటికీ అందాల ఆరబోతకు మాత్రం ఎంతో లిమిట్ పెట్టుకుంది అని  చెప్పాలి. ఇక అందాల ఆరబోత కాకుండా ట్రెడిషనల్ లుక్ లో మాత్రం ఎంతోమంది తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసింది. ట్రెడిషనల్ లుక్ లో ఒక్క చిరునవ్వుతో ఎంతోమంది తెలుగు ప్రేక్షకుల మనుషులు కొల్లగొట్టింది కాజల్ అగర్వాల్. తెలుగు చిత్ర పరిశ్రమలో ట్రెడిషనల్ లుక్ కు మారు పేరుగా మారిపోయింది కాజల్ అగర్వాల్. అయితే ఈ అమ్మడు ఎక్కువ గ్లామరస్ పాత్రలో నటించిన దానికంటే ట్రెడిషనల్ లుక్ లో నటించి నటనకు ప్రాధాన్యమున్న పాత్రలే  ఎక్కువగా ఉన్నాయి అని చెప్పాలి.

 


 అటు తెలుగు ప్రేక్షకులు కూడా కాజల్ అగర్వాల్ ట్రెడిషనల్ లుక్కుకే  బాగా అలవాటు పడిపోయారు. ఏ సినిమాలో అయినా కాజల్ అగర్వాల్ ట్రెడిషనల్ లుక్ లో  కనిపిస్తే చాలు ప్రేక్షకులకు ఎదో తెలియని సాటిస్ఫాక్షన్ ఉంటుంది. కేవలం తన చిరునవ్వు అభినయం తోనే తెలుగు ప్రేక్షకులందరూ మైమరచిపోతూ ఉంటారు. కానీ కాజల్ అగర్వాల్ పొరపాటున హాట్ లుక్ లో కనిపించింది అంటే తెలుగు ప్రేక్షకులు అంతగా జీర్ణించుకోలేరు. ఎందుకంటే కాజల్ అగర్వాల్ ట్రెడిషినల్ లుక్ తో బాగా అలవాటు పడిపోయిన ప్రేక్షకులు... హాట్ లుక్ లో మాత్రం కాజల్ అగర్వాల్ చూసి కాస్త జీర్ణించుకోవడానికి కష్టమే మరి .

మరింత సమాచారం తెలుసుకోండి: