సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత అందాల ఆరబోత చేస్తేనే స్టార్  హీరోయిన్ రేంజ్ కి ఎదగొచ్చు లేకపోతే కష్టమే అనే  ఒక వాదన ఉంది. కానీ నేటి తరం హీరోయిన్లు మాత్రం హాట్ అందాలకు దూరంగా... నటనకు దగ్గరగా  స్టార్ హీరోయిన్ రేంజికి ఎదిగి అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు. ప్రస్తుతం ఇలా  అందాల ఆరబోతకు నటనకు దగ్గరగా తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్న హీరోయిన్లు చాలామందే ఉన్నారు తెలుగు చిత్ర పరిశ్రమలో. ఏది పడితే అది చేయకుండా కేవలం నటన  ప్రాధాన్యం ఉన్న సినిమాలు మాత్రమే  చేసుకుంటూ దూసుకుపోతున్నారు. ఇలా అందాల ఆరబోతకు దూరంగా ఉన్న హీరోయిన్లలో ఒకరు కీర్తి సురేష్. కీర్తి సురేష్ మొదటి నుంచి అందాల ఆరబోతకు దూరంగానే ఉంది... అదే సమయంలో తన అందం అభినయంతో ఆకట్టుకుంటూ వచ్చింది కీర్తి సురేష్. 

 


 అటు ప్రేక్షకులు కూడా కీర్తి సురేష్ ట్రెడిషనల్ లుక్కుకే  బాగా అలవాటు పడిపోయారు. దీంతో కీర్తి సురేష్ అందాలు ఆరబోస్తే బాగుండు అని తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ కోరుకోలేదు. అటు కీర్తి సురేష్ కూడా అభిమానులను ఆకర్షించడానికి ఎక్కడ అందాల ఆరబోత చేయలేదు. మొదటినుంచీ కేవలం నటనకు ప్రాధాన్యమున్న పాత్రలను మాత్రమే ఎంచుకుంటూ ఎన్నో ప్రశంసలు అందుకుంది కీర్తి సురేష్. తెలుగు చిత్ర పరిశ్రమలో నిలదొక్కుకుని స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఇక మహానటి సినిమా  తర్వాత కీర్తి సురేష్ కెరియర్  కీలక మలుపు తిరిగింది  అనే చెప్పాలి. 

 

 మహానటి సినిమా లో సురేష్ ట్రెడిషనల్ లుక్ లో కనిపించడం అందరిని మంత్రముగ్దుల్ని చేసింది. అచ్చం అలనాటి సావిత్రి లాగే కీర్తి సురేష్ తెలుగు ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించింది. అందుకేనేమో కీర్తి సురేష్ ట్రెడిషినల్ లుక్ తో ఎన్ని సినిమాలు చేసినప్పటికీ ప్రేక్షకులు ఆదరిస్తూ వచ్చారు. అటు  ప్రేక్షకులు కూడా కీర్తి సురేష్ హాట్ లుక్ లో చిట్టి పొట్టి డ్రెస్సుల్లో  అస్సలు పోల్చుకోలేరు. పొట్టి పొట్టి డ్రెస్సులు కీర్తి సురేష్ కు సెట్ అవ్వవు కూడా. ఇలా కీర్తి సురేష్ అందాల ఆరబోతకు దూరంగా కేవలం ట్రెడిషనల్ లుక్ తోనే తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్ రేంజికి ఎదిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: