ఈ మధ్యకాలంలో సినీ రంగ ప్రముఖుల మధ్య గిఫ్ట్ ఇచ్చిపుచ్చుకోవడం చాలా కామన్ గా మారిపోయింది. ఇకపోతే తాజాగా కోలీవుడ్ స్టార్ ఆర్య... అదేనండి తెలుగులో రిలీజ్ అయినా రాజు రాణి లోని హీరో. అలాగే హీరోయిన్ సయేశా వీరిద్దరు పెళ్లి చేసుకున్న సంగతి అందరికీ విధితమే.

IHG

 

సయేశా తెలుగులో మీరు గుర్తుపట్టాలంటే అఖిల్ సినిమాలో హీరోయిన్ అంటే ఇట్లే గుర్తు పడతారు. ఇక వారి పెళ్లి రోజు సందర్భంగా మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ఆ దంపతులు ఇరువురూ ఇద్దరు కలిసి ఉన్న పెయింటింగ్ ను గిఫ్ట్ గా పంపించి వారిని ఆశ్చర్యపరిచే చేసింది. 

 

తమన్నా ఇచ్చిన గిఫ్ట్ ను చూసి సయేశా సంతోషంతో ట్విట్టర్ వేదికన థాంక్స్ చెప్పింది. అంతేకాదు తాను పంపించిన పెయింటింగ్ తో వారి కుటుంబ సభ్యులతో నిలబడి సెల్ఫీ దిగి ఆ ఫోటో ని కూడా సయేశా తన ట్విట్టర్ ఖాతా ద్వారా పోస్ట్ చేయడం జరిగింది. 

 

IHG

 

ఈమధ్య ఇలా కొందరు ప్రముఖులు వారి వారి ఏదైనా కుటుంబ కార్యక్రమాల్లో కానీ, పర్సనల్ గా కానీ గిఫ్టులు ఇచ్చిపుచ్చుకుంటూ వాటిని సోషల్ మీడియా ద్వారా తెలుపుతూ తెగ సంబరపడిపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: