నిన్నటి తరంలో ఎంతో మంది హీరోయిన్లు అందాల ఆరబోతతో తెలుగు చిత్ర పరిశ్రమలో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. రమ్యకృష్ణ, రోజా, మీనా లాంటి హీరోయిన్లు ఎన్నో గ్లామరస్ పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకులను ఆకర్షిస్తు గట్టి పోటీ ఇస్తున్నారు. ఇలాంటి సమయంలో కూడా ఎక్కడ అందాల ఆరబోత చేయకుండా స్టార్ హీరోయిన్ గా ఎదిగి  కేవలం తన అభినయంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుని... ఎంతగానో గుర్తింపు సంపాదించిన హీరోయిన్ సౌందర్య. తెలుగు చిత్ర పరిశ్రమలో సౌందర్య సినీ ప్రస్థానం ఎంతో అద్భుతంగా సాగిపోతూ ఉంటుంది. దాదాపుగా తెలుగు చిత్ర పరిశ్రమలోని నిన్నటితరం స్టార్ హీరోలందరి సరసన నటించింది  సౌందర్య. 

 

 ప్రతి సినిమాలో తన నటనతో తన అభినయంతో ఆకట్టుకుంది తప్ప...  ఎక్కడ అందాల ఆరబోత మాత్రం చేయలేదు. మొదటినుంచి అందాల ఆరబోతకు దూరంగానే ఉంటూ వచ్చింది సౌందర్య. అప్పట్లో తన అందాల ఆరబోతతో తెలుగు చిత్ర పరిశ్రమలో సంచలనం సృష్టిస్తున్న హీరోయిన్ల పోటీని సైతం తట్టుకొని... తెలుగు చిత్ర పరిశ్రమలో నిలదొక్కుకుని స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఇక అటు తెలుగు ప్రేక్షకులు కూడా సౌందర్య అభినయానికి  ఎక్కువగా అలవాటు పడిపోయారు. దీంతో సౌందర్య అందాలు ఆరబోస్తే బాగుండు అని ఎక్కడ ఎదురుచూడలేదు. ట్రెడిషనల్ లుక్ లోనే సౌందర్యను  ఆదరించారు. 

 

 ఎంతోమంది గ్లామర్ పాత్రల్లో నటించే హీరోయిన్లు ఉన్నప్పటికీ సౌందర్య మాత్రం వరస అవకాశాలు దక్కించుకుంది. దాదాపుగా కొన్నేళ్లపాటు తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా తన హవా నడిచింది. అయితే మిగతా హీరోయిన్ల విషయంలో అందాల ఆరబోత చేయకపోతే తెలుగు ప్రేక్షకులు కాస్త హర్ట్ అయ్యేవారు కానీ... సౌందర్య విషయంలో మాత్రం ట్రెడిషనల్ లుక్ ని ఎక్కువగా  కోరుకునేవారు. సౌందర్య కూడా ఎక్కువగా ట్రెడిషనల్ లుక్ తోనే బాగా ఆకట్టుకునేది. ఒకవేళ అందాల ఆరబోత చేసినా  సౌందర్య కి అంతగా సెట్ అయ్యేది కాదేమో.

మరింత సమాచారం తెలుసుకోండి: