సినీ పరిశ్రమలో అందాల ఆరబోత చేస్తేనే స్టార్ హీరోయిన్ అవ్వగలరు అనే వాదనను పటాపంచలు చేస్తూ ఎంతో మంది అభిమానులను సంపాదించుకుని  ప్రస్తుతం స్టార్ హీరోయిన్గా రాణిస్తున్న హీరోయిన్ లు  నేటి తరంలో చాలామంది ఉన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఇలా అందాల ఆరబోతకు దూరంగా ఉన్న హీరోయిన్లు ఎక్కువ మంది ఉన్నారు.  చేసినవి కొన్ని సినిమాలే అయినప్పటికీ అందాల ఆరబోతకు దూరంగా ఉండటం నటన కు  దగ్గరగా తెలుగు చిత్ర పరిశ్రమలో ఏ హీరోయిన్ కు లేనటువంటి ఒక ప్రత్యేకమైన క్రేజ్ను సంపాదించుకుంది సాయి పల్లవి. అందరిలాగా హాట్ హాట్ అందాలను ఆరబోయ లేదు.. చూడడానికి ముఖం నిండా మొటిమలతో ఉంటుంది... ఈ అమ్మాయి హీరోయిన్ ఏంటి అని అనుకున్నారు  మొదట్లో అందరూ.

 

 కానీ ప్రస్తుతం అలా అన్నవారే సాయి పల్లవి కి ఫిదా అయిపోయారు అని చెప్పాలి. తెలుగు చిత్ర పరిశ్రమలో ఫిదా సినిమా తో మెగా హీరో వరుణ్ తేజ్ తో జోడీ కట్టి హీరోయిన్గా పరిచయమైంది సాయి పల్లవి. ఇక మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను తనవైపు తిప్పుకుంది అనే చెప్పాలి. ముఖ్యంగా తన ఓన్ వాయిస్ తో తెలంగాణ యాస  లో డైలాగులు చెప్పి తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసింది. ఇక ఆ తర్వాత కూడా ఎన్నో అవకాశాలు వచ్చినప్పటికీ కేవలం నటనకు ప్రాధాన్యమున్న పాత్రలను మాత్రమే చేసుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది సాయి పల్లవి

 

 ప్రస్తుతం సాయి పల్లవి సినిమా వస్తుంది అంటే అందులో సాయి పల్లవి నటన ఎలా ఉండబోతుంది అనేది ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులు ఎదురు చూసేంతలా ప్రభావితం చేసింది సాయి పల్లవి. అయితే మొదటి నుంచీ ఎక్కడ అందాల ఆరబోత మాత్రం చేయలేదు. ఎప్పుడు ట్రెడిషనల్ లుక్ తోనే తెలుగు ప్రేక్షకులను అలరిస్తూ వచ్చింది. ఇక అటు ప్రేక్షకులు కూడా సాయి పల్లవి నుంచి... నటనను ఎక్స్పెక్ట్ చేశారు తప్ప... అందాలు ఆరబోస్తే బాగుండు అని ఇక్కడ కోరుకున్న దాఖలాలు కూడా లేవు. సాయి పల్లవి కి పొట్టి పొట్టి డ్రెస్సులు కూడా సెట్ అవ్వదు అని చెప్పాలి.అందుకే  మొదటినుంచి అలాంటి డ్రెస్సులకి  దూరంగానే ఉంటూ వస్తోంది సాయి పల్లవి .

మరింత సమాచారం తెలుసుకోండి: