చిరంజీవి బాలయ్య ఇద్దరూ టాలీవుడ్ కి రెండు కళ్ళు అన్నారు ఓ సీనియర్ నిర్మాత. అది నిజం కూడా ఎందుకంటే ఇద్దరికీ విశేషంగా అభిమానుల బలం ఉంది. ఇద్దరూ పక్కా మాస్ అప్పీల్ ఉన్న సూపర్ స్టార్లు, ఇద్దరికీ బ్లాక్ బస్టర్ హిట్లు ఉన్నాయి. ఇద్దరి మధ్యన అందమైన పోటీ కూడా ఉంది.

IHG

ఎన్ని మాటలు అనుకున్నా కూడా ఇద్దరూ మంచి స్నేహితులుగా ఉంటూ వస్తున్నారు. ఇదిలా ఉండగా బాలయ్య ఈ మ‌ధ్య చిరంజీవి మీద వరసగా సెటైర్లు వేస్తూ వచ్చారు. సినీ పెద్దగా చిరంజీవి నాయకత్వం మీద బాలయ్య హాట్ కామెంట్స్ కూడా చేస్తూ వచ్చారు. ఇవన్నీ ఉంటే ఇపుడు బాలయ్య రిలీజ్ చేసిన ఒక టీజర్ కూడా మెగా చిచ్చు రేపుతోంది అంటున్నారు.

IHG

బాలయ్య బోయపాటి మూవీలో ఖధ్దర్ చొక్కా పంచ కట్టి బాలయ్య బాగా గర్జించారు ఆ టీజర్ కి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. పది మిలియన్ వ్యూస్ లాగేసి రికార్డులు క్రియేట్ చేసింది కూడా. ఆ లుక్ లో మాస్ లీడర్ గా బాలయ్య అదిరిపోయాడు కూడా.

IHG

అదే టైంలో బాలయ్య ఈ కొత్త గెటప్ తో చిరంజీవికి షాక్ ఇచ్చారని అంటున్నారు. చిరంజీవి మూవీ లూసీఫర్ రీమేక్ లో కూడా ఇలాంటి గెటప్ నే డిజైన్ చేస్తున్నారుట. దీని ఒరిజినల్ లో మోహన్ లాల్ ఆ విధంగానే కనిపిస్తారట. పైగా చిరంజీవికి  కూడా కూడా అడ్డ పంచె చాలా కొత్తది. ఇదే గెటప్ లో వెళ్తే ఆడియన్స్ కు  ఫ్రెష్ లుక్ ఉంటుందని ఆ ఫిల్మ్ యూనిట్ భావించిందట.

IHG

అయితే ఇపుడు బాలయ్య ఆ గెటప్ తో ముందుకు రావడమే కాదు. చిరు మూవీ కంటే ముందే ఈ మూవీని పూర్తి చేసి రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు. అటువంటి సందర్భంలో కచ్చితంగా లూసీఫర్ మూవీలో చిరు మరో కొత్త గెటప్ వెతుక్కోవాల్సిందేనని ప్రచారం సాగుతోంది. మొత్తానికి కొత్త గెటప్ లో బాలయ్య అదరహో అన్నట్లుగా ఉన్నారని ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: