బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య నిజంగా దేశం మొత్తం ఒకింత ఆశ్చర్యపోయింది. ఇకపోతే బాలీవుడ్ సినిమా పరిశ్రమలో ఒక్కసారిగా పెను భూకంపం వచ్చినట్లు అయింది. కేవలం 34 ఏళ్ల వయసులోనే సుశాంత్ సింగ్  రాజ్ పుత్ మన లోకాన్ని విడిచి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడం నిజంగా అందరినీ కలిసి వేసే విషయమే. ఆయన మరణవార్త విన్న తన అభిమానులు శోకసముద్రంలో మునిగిపోయారు. రాజకీయ, సినీ, క్రీడా రంగాల ప్రముఖులు సుశాంత్ మరణానికి సంతాపం తెలియజేశారు.

 


ఇకపోతే సుశాంత్ సింగ్  రాజ్ పుత్  జనవరి 21 , 1986 సంవత్సరం పాట్నా లో జన్మించాడు. స్కూల్ రోజులనుంచి బాగా చదివే సుశాంత్ AIEEE లో ఏకంగా భారతదేశంలోని ఏడవ ర్యాంకు సాధించారు. అంతేకాదు 11 నేషనల్ ఇంజనీరింగ్ ఎగ్జామ్స్ ను అతను క్లియర్ చేశాడు. అతను ఢిల్లీ టెక్నాలజీ యూనివర్సిటీ లో మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి సుశాంత్ ఒలంపియాడ్ ఫిజిక్స్ లో కూడా ఓ నేషనల్ ఆయన గెలిచారు.

 

ఇక ఆ తర్వాత 2008 సంవత్సరంలో సుశాంత్ సింగ్ " కిస్ దేశ్ మే హై మేరా దిల్ " అనే బాలాజీ టెలీ ఫిలింస్ సీరియల్ ద్వారా బుల్లితెర కు పరిచయం అయ్యారు. ఆ సీరియల్ భారీ హిట్ కావడంతో ఒక్కసారిగా ఆయన స్మాల్ స్క్రీన్ పై క్రేజీ స్టార్ గా ఎదిగాడు. ఇక ఇదే సమయంలో "పవిత్ర రిస్తా " అనే మరో సీరియల్లో నటించడంతో బుల్లితెర ప్రేక్షకులకు ఆయన అభిమాన హీరోగా ఇట్లే నిలిచిపోయాడు. ఇక ఆ తర్వాత " కై పో చెయ్ " అనే సినిమాతో బాలీవుడ్ లోకి అడుగు పెట్టాడు సుశాంత్. " శుద్ద్ దేశి రొమాన్స్ " అనే సినిమాతో అమ్మాయిలలో లవర్ బాయ్ ఇమేజ్ ను తెచ్చుకున్నాడు సుశాంత్.

 

 

ఇక ఆ తర్వాత వచ్చిన మహేంద్రసింగ్ ధోని బయోపిక్ లో " ఎంఎస్ ధోని - ది అన్టోల్డ్ స్టోరీ " చిత్రం ద్వారా దేశ వ్యాప్తంగా కాకుండా ప్రపంచ వ్యాప్తంగా తనని గుర్తు పడేటట్టుగా పేరు తెచ్చుకున్నాడు. అప్పటి వరకు కేవలం నటుడిగానే బాలీవుడ్ కి మాత్రమే పరిచయమైన సుశాంత్సినిమా దెబ్బకి దేశవ్యాప్తంగా ఆయనకు ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా తెచ్చిపెట్టింది. ఇకపోతే సుశాంత్ చివరగా "దిల్ సేచరా " అనే ఈ చిత్రంలో నటించిన ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. సుశాంత్ తూనీగ తూనీగ హీరోయిన్ రేఖ చక్రవర్తితో చాలా కాలంగా డేటింగ్ లో ఉన్నాడని అనేక మీడియాలో వార్తలు వచ్చాయి. కాకపోతే సుశాంత్ మరణ వార్త విని దేశంలో ఆయన అభిమానులు నిజంగా ఒకింత షాక్ కు గురయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: