ఏ టైంలో కరోనా వచ్చి లాక్ డౌన్ విధించారో కాని ఓటిటి బిజినెస్ కు బాగా డిమాండ్ పెరిగింది. స్టార్ హీరోల సినిమాలు ఓటిటి రిలీజ్ మొగ్గుచూపకపోయినా సరే మినిమం, మీడియం బడ్జెట్ సినిమాలు మాత్రం ఓటిటికే ఓటేస్తున్నారు. స్టార్ సినిమాలకు బడ్జెట్ ఎక్కువ.. 100 కోట్లు ఓటిటిలు పెట్టలేవు కనుక అవి ఓటిటి రిలీజ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపట్లేదు. కాని మినిమం బడ్జెట్ సినిమాలు మాత్రం ఓటిటిఓ అవకాశంగా మారింది. లేటెస్ట్ గా ఓ సినిమా ఓటిటితో లాభాల బాట పట్టిందని టాక్. అదే సినిమానో కాదు ఉమామహేశ్వర ఉగ్రరూపస్య. బాహుబలి నిర్మాతలు ఆ సినిమా తర్వాత భారీ బడ్జెట్ తో సినిమా చేస్తారు అనుకుంటే మూడున్నర కోట్లతో తీసిన సినిమా ఇది.

 

కేరాఫ్ కంచెరపాలెం సినిమాతో దర్శకుడిగా తన సత్తా చాటిన వెంకటేష్ మహా డైరెక్ట్ చేసిన సినిమా ఇది. ఈ నెల చివరన కాని, జూలై మొదటి వారంలో కాని ఈ సినిమా రిలీజ్ చేస్తుందని అంటున్నారు. నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ ప్లాన్ చేసిన ఈ సినిమాను 4 కోట్లకు కొన్నారని తెలుస్తుంది. సినిమా బడ్జెట్టే 3.5 కోట్లు కాగా 4 కోట్లకు సినిమా అమ్మేసి షాక్ ఇచ్చారు. అంతేకాదు ఈ సినిమా శాటిలైట్ రైట్స్ కూడా మంచి రేటు పలికాయని తెలుస్తుంది. బాహుబలి నిర్మాతలు ఆర్కా మీడియా బ్యానర్ లో శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేనిమూవీ నిర్మించారు.

 

సత్యదేవ్ లీడ్ రోల్ లో నటించిన ఈ సినిమాపై ఆడియెన్స్ లో కూడా ఆసక్తి పెరిగింది. కెరాఫ్ కంచెరపాలెం సినిమాని కూడా ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ చేసి అందరికి షాక్ ఇచ్చిన వెంకటేష్ మహా ఈసారి ఉమామహేశ్వర ఉగ్రరూపస్య సినిమాతో కూడా అందరిని సర్ ప్రైజ్ చేస్తాడని తెలుస్తుంది. మరి ఈ సినిమాకు ఉన్న బజ్ చూస్తుంటే నెట్ ఫ్లిక్స్ లో వ్యూస్ బాగానే వచ్చేలా ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: