తెలుగు చిత్ర పరిశ్రమలో అందరూ ఎదురు చూసింది ఎప్పుడెప్పుడు మళ్ళీ షూటింగ్స్ మొదలవుతాయా అని. అందరికి అనుమతులిచ్చి చిత్ర పరిశ్రమకి అనుమతులు ఇవ్వకపోవడంతో మెగాస్టార్ తో సహా ప్రముఖులు అందరు కలిసి ముఖ్యమంత్రితో చర్చలు జరిపి షూటింగ్స్ జరుపుకోవడానికి అనుమతులు తెచ్చుకున్నారు. అంతేకాదు ఇప్పటి వరకు షూటింగ్ పూర్తయిన సినిమాలకి పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను అలాగే టీవీ సీరియల్స్ ని తిరిగి ప్రారంభించేందుకు అనుమతులు లభించాయి. 

 

అయితే ఇలా అనుమతులు లభించాయో లేదో సీరియల్స్ ఒక్కొక్కటిగా షూటింగ్స్ జరుపుకోవడం ప్రారంభమైంది. టీవీల్లో ప్రోమోస్ కూడా ఇచ్చుకుంటున్నారు. త్వరలో మీ అభిమాన సీరియల్స్ అంటూ లిస్ట్ వేసుకొని మరీ ప్రతీ ఛానల్ జోరుగా ప్రచారం చేసుకుంటున్నారు. అయితే ఇండస్ట్రీలో ప్రముఖులందరు కలిసి తెచ్చుకున్న అనుమతులు సీరియల్స్ కి ఉపయోగపడుతున్నాయి కాని సినిమాలకి కాదా..అన్న టాక్ మొదలైంది. అందుకు కారణం ఇప్పటి వరకు స్టార్ హీరోలు నటిస్తున్న సినిమా ఏ ఒక్కటి తిరిగి షూటింగ్ ప్రారంభించలేదు. 

 

వాస్తవంగా జూన్ 15 నుండి చిత్ర పరిశ్రమలో 40 శాతం చిత్రీకరణ జరుపుకున్న సినిమాలన్ని మొదలవుతాయని అందరు భావించారు. కాని ఇప్పటి వరకు ఒక్క హీరో కూడా తమ సినిమాని సెట్స్ మీదకి తీసుకు వెళ్ళేందుకు ముందుకు రావడానికి ధైర్యం చేయడం లేదని సమాచారం. అందరి కంటే ముందు షూటింగ్ మొదలు పెడతాడనుకున్న రాజమౌళి కూడా ఆలోచనలో పడ్డారని అంటున్నారు. అందుకు కారణాలు ఒకటి బాలీవుడ్ తో పాటు హాలీవుడ్ నటులు ఇప్పట్లో హైదరాబాద్ కి వచ్చే అవకాశాలు లేకపోవడం అయితే ఇద్దరు స్టార్స్ హీరోలున్న ఈ సినిమాకి కనీసం 50 మంది యూనిట్ సభ్యులు కావాల్సి ఉంది. 

 

అయితే ఈ 50 మంది అన్ని డిపార్ట్‌మెంట్స్ కి చెందిన వాళ్ళు పైగా రక రకాల ప్లేస్ నుంచి వచ్చేవాళ్ళు. దీంతో కొంత కరోనా భయం కూడా వెంటాడుతుందని అంటున్నారు. అయితే పూరి జగన్నాధ్ విజయ్ దేవరకొండ తో తీస్తున్న సినిమాని ముందు సాంగ్స్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. కాని ఎప్పటి నుంచో అన్నది క్లారిటీ లేదు. ఇలానే మిగతా సినిమా వాళ్ళు డైలమాలో ఉన్నారట. 

మరింత సమాచారం తెలుసుకోండి: