టాలీవుడ్ లో దాదాపు పెద్ద సినిమాలు 6-7 వరకు రిలీజ్ కి సిద్దంగా ఉన్నాయి. దిల్ రాజు నిర్మాణంలో రూపొందిన సినిమా వి. మోహన క్రిష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నేచురల్ స్టార్ నాని, సుధీర్ బాబు, నివేదా థామస్, బాలీవుడ్ హీరోయిన్ అదితీరావు హైదరీ హీరో హీరోయిన్స్ గా నటించారు. ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని రిలీజ్ కి సిద్దంగా ఉంది. దిల్ రాజు తో పాటు నానిసినిమా మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అందుకు కారణం నాని కి సక్సస్ వచ్చి చాలా కాలం అయింది. అలాగే దిల్ రాజు కి నిర్మాతగా జాను భారీ లాస్ గా మిగిలింది. దాంతో వి సినిమాతో నాని హిట్ ని దిల్ రాజు లాభాలతో మళ్ళీ కోలుకోవాలని అనుకున్నారు. కాని కరోనా కొట్టిన దెబ్బకి అంతా తారుమారు అయింది.

 

IHG's shocking and intense first-look from 'V' | <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=TELUGU' target='_blank' title='telugu-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>telugu</a> <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=CINEMA' target='_blank' title='movie-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>movie</a> ...

 

సినిమా మాదిరిగానే రిలీజ్ క్ రెడీగా రాం నటంచిన రెడ్ సినిమా ఉంది. రాం కి నేను శైలజ వంటి సూపర్ హిట్ ఇచ్చిన కిషోర్ తిరుమల ఈ సినిమాని తెరకెక్కించాడు. ఇస్మార్ట్ శంకర్ తో మంచి మాస్ హిట్ అందుకున్న రాం ఈ సినిమాతో మరో భారీ సక్సస్ ని అందుకోవాలనుకున్న ఆశ అలాగే మిగిలిపోయింది. ఇక అనుష్క నటించిన మల్టీ లాంగ్వేజ్ సినిమా నిశబ్ధం. మాధవన్, అంజలి, శాలినీ పాండే ముఖ్య పాత్రలు పోషించిన ఈ సినిమా కూడా భారీ స్థాయిలో రిలీజ్ చేయాలనుకొని ఆగిపోయారు. కోన వెంకట్ నిర్మాణంలో రూపొందిన ఈ సినిమా సక్సస్ అనుష్క కి చాలా కీలకం.

 

IHG

ఇక ఇలా మాస్ మహారాజ రవితేజ నటించిన క్రాక్ సినిమా కూడా రిలీజ్ కి రెడీగా ఉంది. ఈ సినిమా మీద రవితేజ చాలా నమ్మకంగా ఉన్నాడు. కాని కరోనా మహమ్మారితో లాక్ డౌన్ వింధించినప్పటి నుంచి థియోటర్స్ మూతపడ్డాయి. పరిస్థితులు చూస్తుంటే ఎప్పుడు ఓపెన్ అవుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. ఒకవేళ థియోటర్స్ ఓపెన్ చేసినా జనాలు థియోటర్స్ వైపు రారన్న మాట బలంగా వినిపిస్తుంది. అందుకే నిర్మాతలు తమ సినిమాలని ల్యాబ్ లోనే ఉంచారు. రిలీజ్ చేయాలంటే భయపడుతున్నారు. అయితే కొన్ని సినిమాలను మాత్రం ఓటీటీలో రిలీజ్ చేసేందుకు కొంతమంది మేకర్స్ సిద్దమవుతున్నారు. 

 

IHG

ఇప్పటికే బాలీవుడ్ కోలీవుడ్ సహా టాలీవుడ్ లోను ఒక చిన్న సినిమా ఓటీటీలో రిలీజ్ అయింది. అలాగే రిలీజ్ అవడానికి బాలీవుడ్ అమితాబ్ బచ్చన్, అక్షయ్ కుమార్ లాంటి స్టార్స్ సినిమాలు కూడా ఉన్నాయి. కాని మన తెలుగు నిర్మాతలు మాత్రం అవకాశం ఉన్నా ఓటీటీ వైపు చూడాలంటే వెనకడుగు వేస్తున్నారు. అందుకు కారణం లాభాలు అనుకున్నంతగా రావన్న మాట వినిపిస్తుంది. మరి ఇలా నెలలకు నెలలు రిలీజ్ కాకుండా ఉంటే వడ్డీలు పెరగవా అని కొందరు మాట్లాడుకుంటున్నారు.   

మరింత సమాచారం తెలుసుకోండి: