తెలుగు పరిశ్రమలో అక్కినేని నాగేశ్వరరావు వారసుడు అక్కినేని నాగార్జునకు ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఐదు పదుల వయస్సు దాటిపోతున్నప్పుటికీ  కూడా ఇంకా యువ హీరోలకు సైతం పోటీ ఇస్తూ  దూసుకు పోతున్నాడు నాగార్జున.ఫిట్నెస్  విషయంలో అయినా రొమాన్స్ విషయంలో అయినా యువ హీరోలు కూడా నాగార్జున మందు సాటిరారు అనేంతలా చిత్ర  పరిశ్రమలో ప్రభావితం చేస్తున్నాడు.ఐదు పదుల వయస్సు దాటిన పోతున్నప్పటికీ ఇప్పటికీ కూడా తాను టాలీవుడ్ మన్మధుడు ని అని ప్రతిసారి రుజువు చేస్తున్నాడు నాగార్జున. అయితే నాగార్జున తెలుగు చిత్ర పరిశ్రమలో మొదటి నుంచి యువసామ్రాట్ గా తెలుగు ప్రేక్షకుల మన్మధుడి గా కొనసాగుతున్నాడు. 

 

 తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన మొదటి నుంచి యాక్షన్ సినిమాలో నటించడంతో పాటు.. ఎన్నో సినిమాల్లో లవర్ బాయ్ పాత్రలో కూడా నటించారు నాగార్జున. ఐదు పదుల  వయసు దాటిపోతున్నప్పటికీ ఇప్పటికీ కూడా లవర్ బాయ్ పాత్రలో నటిస్తూ యువ హీరోలకు సైతం పోటీ ఇస్తున్నారు. ఏకంగా నాగార్జున ఇద్దరు కొడుకులు తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోగా కొనసాగుతున్నప్పటికీ.. యువ హీరోలకు సైతం సాధ్యంకాని రొమాంటిక్ సన్నివేశాలలో నటిస్తూ... ఇంకా తాను లవర్ బాయ్ ప్రూ  చేస్తూనే ఉన్నాడు అక్కినేని నాగార్జున. 

 


 అయితే అక్కినేని నాగార్జున ఎలాంటి సినిమాల్లో నటించిన లవర్ బాయ్ పాత్రలోనే కనిపిస్తూ ఉంటాడు అన్న విషయం తెలిసిందే. మొన్నటికి మొన్న సోగ్గాడే చిన్ని నాయన.. ఇక నిన్నటికి నిన్న మన్మధుడు 2 లాంటి సినిమాలలో లవర్ బాయ్ గా  నటించాడు. కానీ ఇప్పటి వరకు నాగార్జున ఏ సినిమాలో కూడా పౌరాణిక పాత్రలు పోషించలేదు. అటు తెలుగు ప్రేక్షకులు కూడా నాగార్జునను పౌరాణిక పాత్రలు అస్సలు ఊహించలేరు. ఎందుకంటే నాగార్జున పేరు ఎత్తగానే ప్రేక్షకులకు గుర్తొచ్చేది లవర్ బాయ్ మాత్రమే .

మరింత సమాచారం తెలుసుకోండి: