తెలుగులో ఒకప్పుడు మల్టీ స్టారర్లు ఎక్కువగా వచ్చేవి.  నాడు అగ్ర హీరోలు అంతా కూడా మరో హీరోతో చేయడాన్ని చాలా బాగా ఎంజాయ్ చేసేవారు. ఇగోలు పక్కన పెట్టి మంచి మెసేజ్ ఫ్యాన్స్ ఇవ్వడానికి ట్రై చేసేవారు. ఆ తరువాత తరంలో మాత్రం హీరోలు మల్టీ స్టారర్ మూవీకి ఎందుకో పెద్దగా ఇష్టపడలేదు.

 

బాలయ్య చిరంజీవిని కలపాలనుకున్నా కుదిరింది కాదు, ఇక బాలయ్య, నాగ్ అనుకున్నారు. అదీ అవలేదు. నాగ్ వెంకీ కూడా వర్కౌట్ కాలేదు. ఇవన్నీ ఇలా ఉంటే సొంత ఫ్యామిలీస్ తో  హీరోలు మూవీస్ చేయడం మొదలెట్టారు. అలా అక్కినేని హీరోలు మూడు తరాలు కలసి చేసిన మూవీ మనం. ఈ మూవీ పెద్ద హిట్ కావడంతో ఒకే ఫ్యామిలీలో హీరోలు మూవీస్ చేసినా సూపరే అనుకున్నారు ఫ్యాన్స్.

IHG's <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=AUDIO' target='_blank' title='audio-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>audio</a> Event

కానీ అందులో ఇంకా మెగా ఫ్యామిలీ హీరోలు మూవీస్ బాకీ ఉన్నాయి.ఇక నందమూరి హీరోల మూవీ  కూడా అలాగే మాటలకే పరిమితం అయింది. అయితే ఇపుడు బాలయ్య ఒక మాట అన్నారు. తానూ జూనియర్ ఎన్టీయార్ కలసి నటిస్తామని కూడా చెప్పాడు. మంచి కధ ఉంటే రెడీ అని కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు.

IHG

దాంతో ఇపుడు బాల్ డైరెక్టర్ల కోర్టులో పడింది. ఈ క్రేజీ మూవీని ప్రొడ్యూస్ చేయడానికి నిర్మాతగా కళ్యాణ్ రాం ఎటూ ఉన్నారు. చూసుకోవాల్సింది డైరెక్టర్నే. అయితే అది కూడా సాధ్యపడేలాగే ఉంది. ఎందుకంటే కళ్యాణ్ రాం పటాస్ మూవీ ద్వారా డైరెక్టర్ గా పరిచయం అయిన అనిల్ రావిపూడికి బాలయ్యతో ఎప్పటినుంచో మూవీ తీయాలని ఉంది.

IHG's <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=SUCCESS' target='_blank' title='success-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>success</a>, bringing back ...

అలాగే ఆయనకు జూనియర్ ఎన్టీయార్ తో మూవీ చేయాలని ఉంది. ఈ ఇద్దరినీ కలిపే భారీ క్రేజీ ప్రాజెక్ట్ ఉంటే దానికి స్టోరీ రెడీ చేయడానికి ఆయన రెడీగానే ఉంటారు. ఇపుడు ఆయనే మంచి కధతో వస్తారని టాక్ వస్తోంది. ఎటూ బాలయ్యతో రామారావు మూవీని అప్పట్లో తీయాలనుకుని ఆగిపోయిన  అనిల్ కి ఇది బంపర్ ఆఫర్ అవుతుంది అంటున్నారు. సో ఈ మూవీ కనుక అనిల్ చేతిలో పడితే ఫుల్ కామెడీతో పాటు, యాక్షన్ మాస్ మసాలా అన్నీ ఉంటాయని అంటున్నారు. మనం మూవీలా ఇది కూడా బెస్ట్ ఫిల్మ్ గా ఇండస్ట్రీలో మిగులుతుంది అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: