తెలుగు సినీ పరిశ్రమలో విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్న హీరో మోహన్ బాబు. కెరీర్ మొదట్లో విలన్ గా, సహాయ నటుడిగా, హీరోగా చేశాడు. విలనిజంలో కామెడీ మిక్స్ చేయడం మోహన్ బాబు స్పెషల్. ఇలాంటి రోల్స్ ఎన్నింటినో చేశాడు మోహన్ బాబు. హీరోగా చేస్తూనే అనేక సినిమాల్లో కామెడీ పండించి మోహన్ బాబు తనకు తానే సాటి అనిపించుకున్నాడు. శోభన్ బాబు హీరోగా వచ్చిన సోగ్గాడు సినిమాలో మోహన్ బాబు పాత్రకు సినిమాలో కీలకం. గ్రామంలో జులాయిగా తిరుగుతూ ఉండే క్యారెక్టర్ లో సినిమాలో నవ్వులు పూయిస్తాడు.

IHG

 

మెగాస్టార్ చిరంజీవితో చేసిన మంచిదొంగ, కొండవీటి దొంగ, కొదమసింహం.. వంటి సినిమాల్లో కామెడీ విలన్ గా ప్రేక్షకుల్ని కడుపుబ్బ నవ్వించాడు. ముఖ్యంగ కొదమసింహం సినిమాలో మోహన్ బాబు పోషించిన సుడిగాలి పాత్ర సినిమా హిట్ లో కీలకంగా నిలిచింది. సీరియస్ కథాంశంలో చిరంజీవి పాత్ర కూడా సీరియస్ గా సాగుతుంది. ఇందులో కూడా విలన్ గా చేసినా సుడిగాలి పాత్రలో చేసిన కామెడీని సినీ ప్రేక్షకులు ఎవరూ మర్చిపోలేరు. ఆ పాత్రను తాను తప్ప మరెవరూ చేయలేరనేంతగా కామెడీ చేసి మెప్పించాడు. వెంకటేశ్ కూలీ నెం.1 సినిమాలో కూడా కామెడీ విలన్ గానే చేశాడు. ఇటువంటి పాత్రల్లో మోహన్ బాబు స్పెషల్ అని చెప్పాలి.

IHG

 

ఇవే గాక తాను హీరోగా చేసిన అనేక సినిమాల్లో కూడా అద్భుతమైన కామెడీ పండించాడు మోహన్ బాబు. అల్లుడుగారు, అల్లరి మొగుడు, అసెంబ్లీ రౌడీ, దొంగ పోలీస్.. వంటి అనేక సినిమాల్లో హీరోయిజం చేస్తూనే ప్రేక్షకుల్ని కడుపుబ్బ నవ్విస్తాడు మోహన్ బాబు. తనలోని మల్టీ టాలెంట్ ను కెరీర్లో అనేక సందర్భాల్లో నిరూపించుకున్నాడు. అందుకే తెలుగు ప్రేక్షకులు మోహన్ బాబును విలక్షణ నటుడిగా పట్టం కట్టారు.

IHG

మరింత సమాచారం తెలుసుకోండి: