విజయేంద్ర ప్రసాద్ రాజమౌళిల బంధం తండ్రి కొడుకులుగానే కాకుండా వారిద్దరి సినిమాల కెరియర్ కు సంబంధించి కూడ ఒకరితో ఒకరు పెనవేసుకునిపోయింది. ఇప్పటివరకు రాజమౌళి తీసిన ప్రతి సినిమాకు విజయేంద్ర ప్రసాద్ మాత్రమే కథ అందించాడు. కథకు సంబంధించిన చర్చలలో కూర్చున్నప్పుడు రాజమౌళి విజయేంద్ర ప్రసాద్ లు ఒక తండ్రి కొడుకులు లా కాకుండా ఒక దర్శకుడు ఒక రచయిత లా అనేక విషయాలలో చాల సీరియస్ గా చర్చలు చేసుకుంటూ ఉంటారని రాజమౌళి సన్నిహితులు చెపుతూ ఉంటారు.


అలాంటి విజయేంద్ర ప్రసాద్ రాజమౌళి చిరకాల స్వప్నానికి అడ్డు తగలబోతున్నాడా అంటూ కొందరు సందేహాలు వ్యక్త పరుస్తున్నారు. తెలుస్తున్న సమాచారం మేరకు బాలీవుడ్ టాప్ హీరో అమీర్ ఖాన్ విజయేంద్ర ప్రసాద్ ల మధ్య జరుగుతున్న చర్చలు ఒకవిధంగా రాజమౌళికి షాకింగ్ గా మారాయి. అమీర్ ఖాన్ ఎప్పటి నుండో ‘మహాభారతం’ ప్రాజెక్ట్ కోసం ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే.


ఈక్రమంలో చాలమంది రైటర్స్ ని సంప్రదించిన అమీర్ ఖాన్ చివరకి విజయేంద్ర ప్రసాద్ అయితేనే ఈ ప్రాజెక్ట్ కు న్యాయం చేయగలడని అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. వాస్తవానికి ‘మహాభారతం’ ను వెబ్ సిరీస్ గా తీయాలని అమీర్ ఖాన్ భావించాడు. అయితే ఇప్పుడు తన ఆలోచనలు మార్చుకుని కరోనా వల్ల ఏర్పడ్డ పరిస్థితులను కూడ లెక్కచేయకుండా ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ను మూడు భాగాలుగా తీయాలని అమీర్ ఖాన్ ఆలోచన అని టాక్.


ఈమూవీకి నిర్మాతలుగా వ్యవహరించడానికి ఒక అంతర్జాతీయ నిర్మాణ సంస్థ ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈప్రాజెక్ట్ విషయమై తుది చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. దీనితో అమీర్ ఖాన్ కోరికమేరకు విజయేంద్ర ప్రసాద్ బాలీవుడ్ ‘మహాభారతం’ కు రచయితగా మారితే ఇక జక్కన్న తన భారీ ప్రాజెక్ట్ ‘మహాభారతం’ ఆలోచనలు పూర్తిగా విరమించుకుంటాడా లేదంటే తన తండ్రిని పక్కకు పెట్టి మరో ప్రముఖ రచయిత చేత తన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘మహాభారతం’ కు మరో ప్రముఖ రచయిత సహాయం కోరతాడా అన్నది ప్రస్తుతానికి సమాధానం లేని ప్రశ్నలు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: