కరోనా సమస్య రోజురోజుకు తీవ్రమవుతున్న పరిస్థితులలో ప్రజలను ఎలా కాపాడుకోవాలో తెలియక ప్రభుత్వాలు మధన పడిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితులలో కరోనాను కట్టడిచేయడానికి ప్రధాని మోడీ మళ్ళీ రంగంలోకి దిగి మళ్ళీ ఆంక్షలను కఠినం చేస్తారు అన్న ఊహాగానాలు వస్తున్నాయి.


ఈనెల 16 17 తేదీలలో ప్రధాని మోడీ దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో చర్చలు జరిపి కోవిడ్-19 నియంత్రణ కోసం కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటారు అన్న ప్రచారం ఊపందుకుంది. ఇలాంటి పరిస్థితులలో షూటింగ్ లకు అనుమతులు లభించినా టాప్ హీరోల సినిమాలకు సంబంధించి షూటింగ్ లు ఇప్పట్లో మొదలుకావు అన్నసంకేతాలు వస్తున్నాయి.


ఇప్పటికే మహేష్ అల్లు అర్జున్ లు తమ కొత్త సినిమాలను డిసెంబర్ లో మొదలు పెట్టుకుందాము అని తమ నిర్మాతలకు స్పష్టంగా చెప్పినట్లు టాక్. ప్రభాస్ ఆలోచనలు కూడ ఇలాగే ఉన్నాయి అని అంటున్నారు. వీరందరి నిర్ణయాలు తెలుసుకున్న చిరంజీవి తన ‘ఆచార్య’ షూటింగ్ పునఃప్రారంభం విషయమై ఇప్పుడు మళ్ళీ ఆలోచనలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.


వాస్తవానికి జూనియర్ చరణ్ లకు కూడ ఇవే అభిప్రాయాలు ఉన్నా రాజమౌళి ఒత్తిడితో ‘ఆర్ ఆర్ ఆర్’ షూటింగ్ కు రెడీ అవుతున్న పరిస్థితి. ఇలా టాప్ హీరోలందరూ రకరకాల ఆలోచనలు చేస్తున్నా పవన్ కళ్యాణ్ మాత్రం ఒక స్థిర నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తెలుస్తున్న సమాచారం మేరకు పవన్ దర్శకుడు వేణు శ్రీరామ్ ను పిలిపించుకుని ‘వకీల్ సాబ్’ కు సంబంధించిన పెండింగ్ షూటింగ్ ను మొదలుపెడితే వీలైనంత త్వరలో ఈ కరోనా భయాలు పక్కకు పెట్టి షూటింగ్ ను పూర్తి చేద్దాము అని భరోసా ఇచ్చినట్లు టాక్. వాస్తవానికి గతంలో టాప్ హీరోలు అంతా వరసపెట్టి సినిమాలు చేస్తుంటే పవన్ తన సినిమాలకు రకరకాల కారణాలతో బ్రేక్ ఇచ్చాడు. ఇప్పుడు పవన్ తన మనసు మార్చుకుని వరసపెట్టి సినిమాలు చేద్దాము అని అనుకుంటే కరోనా అడ్డుగా మారింది. అయితే ఏవిషమయం పై అయినా ఒక నిర్ణయం తీసుకుంటే చాల మొండిగా వ్యవహరించే పవన్ ఇప్పుడు ‘వకీల్ సాబ్’ షూటింగ్ ను మొదలుపెట్టి వేగంగా పూర్తి చేయగలిగితే తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఏ టాప్ హీరో చేయని సాహసం చేయడమే కాకుండా ఈసంవత్సరంలో కరోనా సమస్యల తరువాత విడుదల అయ్యే మొదటి టాప్ హీరో సినిమా ‘వకీల్ సాబ్’ కాబోతోంది. మరి పవన్ స్పీడ్ కు కరోనా ఎలాంటి ట్విస్ట్ ఇస్తుందో చూడాలి..

 

మరింత సమాచారం తెలుసుకోండి: