ప్రస్థుతం ఇండస్ట్రీ దృష్టి అంతా ‘ఆర్ ఆర్ ఆర్’ పైనే ఉంది. అత్యంత భారీ బడ్జెట్ తో తీస్తున్న ఈమూవీని లేటెస్ట్ గా ప్రభుత్వం చూపించిన నియమ నిబంధనలకు లోబడి ఎలా రాజమౌళి షూట్ చేస్తాడు అన్నవిషయమై ఇండస్ట్రీ వర్గాలలో ఆసక్తి రోజురోజుకు పెరిగిపోతోంది.


అత్యంత భారీ బడ్జెట్ తో తీయబడుతున్న ఈసినిమా గురించి ప్రస్తుతం దానయ్యకు విపరీతంగా టెన్షన్ కొనసాగుతున్నట్లు టాక్. లాక్ డౌన్ కారణంగా గత మూడు నెలలుగా ‘ఆర్ ఆర్ ఆర్’ షూటింగ్ నిలిచిపోయిన సంగతి తెలిసిందే. దీనితో ఈమూవీ అనుకున్న విధంగా 2021 జనవరిలో విడుదల అయ్యే అవకాశం కనిపించలేదు. ఈసినిమా షూటింగ్ ఆలస్యం అయ్యే కొద్ది నిర్మాణ వ్యయం పెరిగి పోవడమే కాకుండా వడ్డీల భారం పెరిగిపోతోందని దానయ్య టెన్షన్ అని అంటున్నారు.


ఇప్పటికే ఈసినిమా నిర్మాణం కోసం వందల కోట్లు ఖర్చుపెట్టిన దానయ్య ప్రస్తుతం కరోనా పరిస్థితులు వల్ల బయట షూటింగ్స్ నిర్వహించే పరిస్థితి లేని కారణంగా భారీ సెట్స్ నిర్మించి షూటింగ్ జరపాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ఖరీదైన సెట్స్ కోసం మరికొన్ని కోట్లు అదనంగా పెట్టుబడి పెట్టవలసి రావడంతో ఈమూవీ మార్కెట్ తాను పెట్టిన పెట్టుబడి స్థాయిలో ఉంటుందా ఉండదా అనే టెన్షన్ దానయ్యకు కొనసాగుతున్నట్లు టాక్.


ఈపరిస్థితులు ఇలా ఉండగా రాజమౌళి ఆలోచనలు ఈసినిమా షూటింగ్ కు సంబంధించి వేరే విధంగా ఉన్నాయి అని అంటున్నారు. ఈ సినిమా యూనిట్ లోని ప్రతియూనిట్ మెంబర్ కు ‘పిపియి’ సెట్స్ రెడీ పెట్టమని రాజమౌళి దానయ్యకు సలహా ఇచ్చినట్లు టాక్. అయితే యూనిట్ సభ్యులు అందరికీ ‘పిపియి’ యూనిట్స్ ఏర్పాటు చేయడం ఖర్చుతో కూడుకున్న పని అనీ దానయ్య భావిస్తున్నా ప్రస్తుతానికి మార్గం లేదు అని అంటున్నారు. ఇది ఇలా కొనసాగుతూ ఉండగా ఈ సినిమాకు సంబంధించిన మాక్ షూట్ ను గండిపేట వద్ద నిర్వహించాల లేదంటే అల్యూమినియం ఫ్యాక్టరీలో నిర్వహించాల అనే విషయమై కూడ దానయ్య రాజమౌళిల మధ్య అనేక చర్చలు జరుగుతున్నాయి అని తెలుస్తోంది..

మరింత సమాచారం తెలుసుకోండి: