సునీల్.. మంచి కామెడియాన్ . ఎన్నో సినిమాల్లో తన కామెడీతో.. తన టైమింగ్ తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు. అలాంటి సునీల్ అందాల రాముడు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. నిజం చెప్పాలి అంటే సునీల్ హీరోగా రాకపోయి ఉండి ఉంటే ఈరోజు టాప్ కమెడియన్ గా ఉండేవాడు. 

 

IHG

 

అలాంటి కమెడియన్ పోస్ట్ వదులుకొని హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆతర్వాత రాజమౌళి దర్శకత్వంలో మర్యాద రామన్న సినిమాలో హీరోగా నటించాడు. ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది. అందుకే సునీల్ ఆ తర్వాత వచ్చిన అన్ని సినిమాల్లో హీరోగానే నటించాడు. కానీ సునీల్ ని హీరోగా ఎవరు నమ్మలేకపోయారు. 

 

IHG

 

ఇంకా ఆతరువాత కొన్ని సినిమాల్లో సెకండ్ హీరోగా చేసి.. మరి కొన్ని సినిమాల్లో విలన్ గా చూసి.. చివరికి మళ్లీ కమెడియన్ అయ్యాడు. అయితే ఎంత కమెడియన్ అయినప్పటికీ సునీల్ ని మాస్ పాత్రల్లో అసలు చూడలేం. ఎందుకంటే మాస్ పాత్రల్లో సునీల్ మనల్ని అంత అలరించలేడు. 

 

IHG

 

సాధారణంగానే సునీల్ లుక్ మాస్ గానే కనిపిస్తుంది. ఇంకా అలాంటి మాస్ లుక్ ఉన్న సునీల్ మాస్ పాత్రల్లో నటిస్తే ప్రేక్షకులు కూడా చూడలేరు. అందుకే సునీల్ ప్రస్తుతం తీసుకునే పాత్రలు కూడా కొంచం క్లాస్ గా ఉండేలా చేస్తే బాగుంటాయి. అయితే మొదట్లో కమెడియన్ గా ఉన్నప్పుడు కూడా మరి మాస్ గా కాకుండా నటించాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: