నందమూరి నట సింహం బాలకృష్ణ ఈమధ్యనే 60వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఎప్పుడు లేనిధి ఈసారి బర్త్ డేకి ప్రముఖ మీడియా సంస్థలన్నిటికి ఇంటర్వ్యూ ఇచ్చారు బాలకృష్ణ. ప్రస్తుతం బోయపాటి శ్రీను డైరక్షన్ లో సినిమా చేస్తున్న బాలయ్య బాబు పుట్టినరోజు కానుకగా ఆ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ తో మెప్పించారు. సింహా, లెజెండ్ తర్వాత బాలకృష్ణ, బోయ్పాటి శ్రీను కాంబోలో హ్యాట్రిక్ మూవీగా వస్తున్న ఆ సినిమా టీజర్ అదిరిపోయింది.

 

బోయపాటి మార్క్ మిస్ అవకుండా నందమూరి ఫ్యాన్స్ ను ఖుషి చేసేలా ఈ సినిమా ఉంటుందని తెలుస్తుంది. ఇదిలాఉంటే ఈ సినిమా తర్వాత బాలకృష్ణ ఎవరితో సినిమా చేస్తాడు అన్నది ఇంకా తెలియలేదు. అయితే రీసెంట్ ఇంటర్వ్యూస్ లో మాత్రం తనతో సినిమా చేయాలంటే మాత్రం ఇక మీదట కొత్త కథలను తీసుకురావాలని చెప్పారు బాలయ్య బాబు. ఆడియెన్స్ టేస్ట్ కు తగినట్టుగా ట్రెండ్ ఫాలో అవ్వాలని ఫిక్స్ అయ్యారు బాలకృష్ణ. అందుకే ఇక మీదట మూస కథలకు మంగళం పాడేసి కొత్త కథలను.. కొత్త దర్శకులను ఎంకరేజ్ చేయాలని నిర్ణయించుకున్నారు.

 

సరైన సినిమా పడితే బాలయ్య సినిమా బాక్సాఫీస్ మీద చేసే గర్జన ఎలా ఉంటుందో తెలిసిందే. బోయపాటి శ్రీను సినిమా తర్వాత అనీల్ రావిపుడితో బాలకృష్ణ సినిమా ఉంటుందని వార్తలు వస్తున్నాయి. నందమూరి హీరో కల్యాణ్ రాం తో పటాస్ సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చి వరుస హిట్లతో సూపర్ ఫాం లో ఉన్న అనీల్ రావిపుడి ఈ ఇయర్ మహేష్ తో సరిలెరు నీకెవ్వరు సినిమాతో హిట్ కొట్టాడు. ప్రస్తుతం ఎఫ్-3 సినిమా కోసం స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్న అనీల్ బాలయ్య బాబుకి సూటయ్యే పర్ఫెక్ట్ స్టోరీ రాసుకున్నాడట. ఈ కాంబినేషన్ సెట్ అయితే టాలీవుడ్ లో ఓ కొత్త సెన్సేషన్ స్టార్ట్ అయినట్టే.

 

మరింత సమాచారం తెలుసుకోండి: