టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్, అల్లు అర్జున్ హీరోగా పుష్ప అనే సినిమాని తెరకెక్కిస్తున్నాడు. అల వైకుంఠపురములో బ్లాక్ బస్టర్ తర్వాత అల్లు అర్జున్ చేస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందన్న్న హీరోయిన్ గా నటిస్తుంది. సుకుమార్ మొదటగా కథ రాస్తున్నప్పుడు ఈ సినిమాని కేవలం తెలుగు ప్రేక్షకుల కోసమే తీద్దామని అనుకున్నాడట. కానీ అల్లు అర్జున్ హీరోగా కన్ఫర్మ్ అయ్యాకే పాన్ ఇండియా ఆలోచన వచ్చిందట.

 

ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కే ఈ సినిమాలో బన్నీ లారీ డ్రైవర్ గా కనిపించబోతున్నాడు. ఇప్పటికే రిలీజైన రెండు పోస్టర్లకి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. లారీ డ్రైవర్ గా బన్నీ లుక్ అదిరిపోయింది. ఊరమాస్ లుక్ లో బన్నీ మరింత స్టైలిష్ గా అనిపించాడు. ఈ సినిమాలో బన్నీ చిత్తూరు జిల్లా యాసలో మాట్లాడనున్నాడు. అందుకోసం ఆ యాసని కూడా నేర్చుకున్నాడట. అదీ గాక ఈ సినిమాలో ఎక్కువ మంది నటుల్ని చిత్తూరు ప్రాంతం వారినే తీసుకున్నారట.

IHG

ఇదిలా ఉంటే, సుకుమార్ సినిమాల్లో ఐటెం సాంగ్స్ కి చాలా ప్రత్యేకత ఉంటుంది. మొదటి సినిమా ఆర్య నుండి మొదలు పెడితే మొన్నటి రంగస్థలం వరకూ ప్రతీ సినిమాలోని ఐటెం సాంగ్ కి మంచి పేరొచ్చింది. అన్ని సినిమాల్లో లాగే ఈ సినిమలోనూ ఒక ప్రత్యేక గీతం ఉండనుందట. అందుకోసం దేవిశ్రీ ప్రసాద్ ఆల్రెడీ బాణీలని ఇచ్చేశాడని సమాచారం. అయితే ఈ ప్రత్యేక గీతంలో బన్నీతో స్టెప్పులు వేయడానికి బాలీవుడ్ హాట్ ఐటెం ఊర్వశి రౌతెలాని తీసుకోవాలని అనుకున్నారట.

 

అయితే ఈ స్పెషల్ నంబర్ కోసం ఊర్వశి కోటి రూపాయలు డిమాండ్ చేసిందట. అసలే కరోనా టైమ్ లో పారితోషికాలు తగ్గించుకోవాలని చెప్తున్న టైమ్ లో ఐదు నిమిషాల పాట కోసమ్ కోటి రూపాయలు డిమాండ్ చేయడంతో ఊర్వశిని తీసుకోవాలనే ఆలోచనని విరమించుకున్నారట. ఇప్పుడు ఆ ప్రత్యేక గీతంలో నటించే మరో హీరోయిన్ కోసం వెతుకుతున్నారట. మొత్తానికి హాట్ బ్యూటీ పెద్ద షాకే ఇచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: