క్రాక్.. మాస్ మహారాజ్ ఎన్నో ఎక్సపెక్టేషన్స్ పెట్టుకొని తీసిన సినిమా ఇది. ఈ సినిమాకు ముందుగానే కొన్ని ఎక్సపరిమెంట్లు చేశాడు రవి తేజ. కానీ అవి బెడిసి కొట్టాయి. దీంతో తన స్టయిల్ మాస్ లోనే ఓ సినిమా చెయ్యాలి అని క్రాక్ చేస్తున్నాడు. ఇంకా ఈ సినిమా ఇంతకు ముందు రవితేజకు డాన్ శీను, బలుపు వంటి సూపర్ హిట్లు ఇచ్చిన మలినేని గోపిచంద్ దర్శకత్వంలోనే ఈ సినిమా రూపొందుతుంది. 

 

అయితే ఈ సినిమా ప్రారంభమైనప్పటి నుండి కూడా ఈ సినిమాపై ఓ ప్రచారం జరుగుతుంది. ఆ ప్రచారం ఏంటి అంటే? ఓ తమిళ్ సినిమాకు రీమేక్ ఏ ఈ క్రాక్ అని ఎప్పటి నుండో ప్రచారం జరుగుతుంది. అయితే ఈ ప్రచారానికి నో చెప్తూనే సినిమా పోస్టర్ మీద ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా తెరకెక్కిన సినిమా అంటూ పోస్టర్ వేశాడు. 

 

అయితే మొన్న ఈ మధ్య రిలీజైన 'క్రాక్' టీజర్ ను చూసి ఇది నిజంగానే రీమేక్ అని తమిళ హిట్ 'సేతుపతి' సినిమాని గుర్తు చేసే కొన్ని సీన్లు ఉన్నాయి అని అన్నారు. అయితే ఇంకా ఈ క్రాక్క్ సినిమా సేతుపతి రీమేక్ అని ఫిక్స్ అయ్యారు. అయితే ఈ సూపర్ హిట్ సేతుపతి చిత్రం జైదేవ్ పేరుతో తెలుగులో రీమేక్ చేశారట.. అయినప్పటికీ ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకు పెద్దగా తెలియదు. 

 

ఇంకా ఈ సినిమా రీమేక్ అనే ప్రచారంపై గోపీచంద్ కూడా సీరియస్ అయ్యి ఆంధ్రలో జరిగిన రియల్ కథ ఆధారంగానే చేస్తున్నట్టు చెప్పాడు. క్రాక్ రీమేక్ కాదు అని బల్ల గుద్ది మరి చెప్పాడు. అయితే కొందరు సినిమా విశ్లేషకులు మాత్రం దాని రీమేక్ అయినప్పటికీ గోపీచంద్ తనదైన శైలిలో కథ మార్చినట్టు చెప్తున్నారు. మరి నిజం ఏంటి అనేది తెలియాలి అంటే సినిమా రిలీజ్ అవుతే కానీ చెప్పలేం. 

మరింత సమాచారం తెలుసుకోండి: