ఇప్పుడు  మన తెలుగులో కొన్ని కొన్ని పాత్రలు కొందరు హీరోలు చేయడానికి చాలా వరకు ఇబ్బంది పడుతున్న సంగతి తెలిసిందే. తమకు ఉన్న స్టార్ ఇమేజ్ ని దృష్టి లో పెట్టుకుని వారు కొన్ని పాత్రలు చేయడానికి భయపడుతున్నారు అనే విషయాన్ని కూడా స్పష్టంగా చెప్పుకోవచ్చు. అయితే మన తెలుగులో కొందరు హీరోలు మాత్రం కొన్ని కొన్ని పాత్రల విషయంలో గతంలో ఏ విధంగా కూడా భయపడిన సందర్భం అనేది లేదు అనే చెప్పాలి. నాగార్జున వెంకటేష్ చిరంజీవి బాలకృష్ణ వంటి హీరోలు ఏ పాత్రలో అయినా సరే కథ డిమాండ్ చేస్తే మాత్రం బాగా అసూట్ అవుతారు. 

 

ఇక రవి తేజా విషయానికి వచ్చి చూస్తే తెలుగు సినిమా హీరోల పంథా ను ఆయన పూర్తిగా మార్చేశాడు అనేది చాలా మంది చెప్తూ ఉండే మాట. అవును రవి తేజా విషయంలో ఇది మాత్రం వాస్తవం అని అంటారు టాలీవుడ్ జనాలు. హీరో అప్పటి వరకు ఆ రేంజ్ లో ఆ విధంగా కామెడి చేయవచ్చు అని చెప్పిన హీరో అతనే అనేది వాస్తవం. అప్పటి వరకు కూడా ఎవరూ కూడా ఆయన స్థాయిలో నటించలేదు. హీరో కామెడి చేయడం అనేది తెలిసినా సరే ఆ స్థాయిలో హీరో కామెడి అనేది ఉంటుంది అనే విషయం మాత్రం సినీ ప్రపంచానికి అతనే పరిచయం చేసాడు అని చెప్పవచ్చు. 

 

కొన్ని కొన్ని సినిమాల్లో అయితే అతను కనపడితే నవ్వినా సన్నివేశాలు కూడా ఉన్నాయి అని అంటే ఏ విధంగా ఆయన కామెడి చేసారు అనేది అర్ధం చేసుకోవచ్చు. ఈ తరం హీరోలు ఎవరూ కూడా ఆ విధంగా చేయడానికి కూడా భయపడుతున్నారు అనేది వాస్తవం అనే చెప్పాలి. ఇప్పుడు ఆయన రెండు సినిమాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: