మన తెలుగులో వచ్చిన రెండు మూడేళ్లకే మంచి హీరో గా అగ్ర హీరోగా మంచి పారితోషికం తీసుకునే హీరోగా పేరు తెచ్చుకున్నాడు తరుణ్. తల్లి ఒకప్పుడు మంచి హీరోయిన్ అయినా సరే తనకు సొంతగా బ్యాక్ గ్రౌండ్ ఉన్నా సరే అతను మాత్రం సొంతగా పైకి రావడానికి ప్రయత్నాలు చేసి పైకి వచ్చాడు అనే చెప్పాలి. ఇక అతని సినిమాలు అతని నటనక్కు చాలా తక్కువ కాలంలోనే జనాలు ఫిదా అయ్యారు అనే చెప్పాలి. చిన్న వయసు లోనే అతను మంచి హీరోగా పేరు తెచ్చుకున్నాడు. అగ్ర హీరోగా నిలబడే సమయంలో అతనిని కొన్ని కొన్ని వ్యవహారాలూ బాగా ఇబ్బంది పెట్టాయి అని చెప్పాలి. 

 

ఇక ఇప్పుడు అతను సినిమాలకు చాలా వరకు దూరంగా ఉన్నాడు. ఇక అది పక్కన పెడితే ఇప్పుడు అతని గురించి చెప్పేది ఏంటీ అంటే... అతను లవర్ బాయ్ గా చాలా బాగా సెట్ అయ్యాడు అని చెప్పవచ్చు. అమ్మాయిల్లో అతనికి లవర్ బాయ్ ఇమేజ్ మాత్రం చాలా బాగా స్టార్ ఇమేజ్ ని తీసుకొచ్చింది. గ్లామర్ విషయంలో మాత్రం అతను చాలా వరకు ఆకట్టుకున్నాడు. అప్పుడు ఎక్కువగా నాగార్జున హవా ఉండేది. దానిని తట్టుకుని అతను లవర్ బాయ్ ఇమేజ్ ని నిలబెట్టుకున్నాడు అనే చెప్పాలి. కెరీర్ లో చాలా వరకు ఆ ఇమేజ్ తోనే అతను పైకి వచ్చాడు అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. 

 

ఇక ఇప్పుడు అతను సినిమాలను చేయడం లేదు అనే చెప్పాలి. అవకాశాలు వచ్చినా సరే అతను మాత్రం సినిమాలను చేయడానికి ఆసక్తి చూపించడం లేదు. అగ్ర హీరో ఇమేజ్ నుంచి కనీసం అతనిని ఎవరూ కూడా పట్టించుకోరు అనే స్టేజి కి వచ్చాడు. ఇక అతను పెళ్లి కూడా చేసుకోలేదు  మరి. ఎప్పుడు చేసుకుంటాడో...

మరింత సమాచారం తెలుసుకోండి: