మన తెలుగులో నాగార్జున కు ఉన్న ఇమేజ్ గురించి ఎంత చెప్పినా సరే తక్కువే అవుతుంది. తండ్రి వారసత్వాన్ని నిలబెట్టిన హీరో గా నాగార్జున గురించి చెప్తూ ఉంటారు ఆయన అభిమానులు సినీ పరిశీలకులు కూడా. తండ్రి వారసత్వాన్ని పూర్తి స్థాయిలో అందుకోకపోయినా సరే సినిమాలో మాత్రం తన ప్రభావాన్ని అతను పూర్తి స్థాయిలో చూపించాడు అనేది వాస్తవం. ఇక అది పక్కన పెడితే అతను ఏ పాత్రలో అయినా సరే జనాలను చాలా బాగా ఆకట్టుకున్నాడు అనే చెప్పాలి. ఇక లవర్ బాయ్ అయినా మరో పాత్రలో అయినా సరే తన మార్క్ ని నాగ్ వేసాడు. 

 

లవర్ బాయ్ పాత్రలకు అతనికి వచ్చిన ఇమేజ్ మన్మధుడు. అంత తక్కువ కాలంలో ఆ విధంగా అతనికి ఆ రేంజ్ లో వచ్చిన పేరు చూసి టాలీవుడ్ లో స్టార్ హీరోలుగా ఉన్న వాళ్ళు కూడా షాక్ అయ్యారు అనేది కొందరి మాట. ఇక అతను యాక్షన్ సినిమాలు అంటే...  శివమణి లాంటి సినిమాల్లో కూడా ప్రేక్షకులను చాలా బాగా ఆకట్టుకున్నాడు. మాస్ లాంటి సినిమా అయినా సరే ఆయనకు మంచి పేరు తీసుకొచ్చింది. అయితే కెరీర్ లో ఆయనకు వచ్చిన లవర్ బాయ్ ఇమేజ్ బాగా ఇబ్బంది పెట్టింది అనేది కొందరి మాట. మరి ఎంత వరకు నిజం అనేది తెలియదు గాని మంచి పాత్రలు ఉన్నా సరే ఆయనను కొందరు పక్కన పెట్టారు అంటారు. 

 

ఇక ఇదిలా ఉంటే ఆయన ఇప్పుడు సినిమాలకు చాలా దూరంగా ఉన్నారు. ఎప్పుడో ఒక సినిమాలో మినహా ఆయన నటించడం లేదు. తనకు స్టార్ ఇమేజ్ తగ్గడమే దీనికి కారణం అని ఆయన అభిమానులు అంటారు. ఇప్పుడు ఆయన సినిమాల నిర్మాణం మీద ఎక్కువగా దృష్టి పెట్టాడు అనేది తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: