మన తెలుగులో బాలయ్య సినిమాలు అనగానే చాలా మందికి ఆయన చేసే పాత్రలే గుర్తుకు వస్తూ ఉంటాయి. చాలా వరకు ఆయన పవర్ ఫుల్ పాత్రల్లో మాత్రమే కనపడుతూ ఉంటారు అనే విషయం అందరికి తెలిసిందే. ఏ స్టార్ హీరో కూడా చేయని విధంగా ఆయన కొన్ని కొన్ని పాత్రలు చేసారు. ప్రతీ పాత్రలో కూడా ఆయన అలరించారు అనేది వాస్తవం. ఇక అది అలా ఉంటే ఆయన సినిమాల్లో ఉండే కొన్ని కొన్ని రోల్స్ ఎవరూ చేయలేరు అనేది వాస్తవం. ఆయన హీరోగా వచ్చిన కొన్ని సినిమాలు ఆ విధంగా ప్రేక్షకులకు అలా గుర్తున్నాయి. 

 

రాజకీయ నాయకుడి పాత్రలు అయితే బాలయ్య తర్వాతే ఎవరు అయినా సరే అనేది వాస్తవం. తన తండ్రి బయోపిక్ అయినా సరే లెజెండ్ సినిమాలో అయినా సరే ఆయన మాత్రం అదే విధంగా కనిపించారు. ఆ సినిమాల్లో ఆయన పూర్తి స్థాయి రాజకీయ నాయకుడిగా అలరించారు అనేది అందరికి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాలో ఆయన పాత్రలే హైలెట్ అయ్యాయి. లెజెండ్ లో ఆయన పూర్తి స్థాయి రాజకీయ నాయకుడిగా కనపడలేదు గాని ఎన్టీఆర్ బయోపిక్ రెండో భాగంలో మాత్రం పూర్తి స్థాయి రాజకీయ నాయకుడిగా కనిపించారు. 

 

ఆ సినిమాలో ఆయన నటనకు చాలా మంచి మార్కులు పడ్డాయి. సినిమా హిట్ అవడానికి ఆయన పాత్రే ప్రధాన కారణం అనేది ఆయన అభిమానులతో పాటుగా చాలా మంది చెప్పే మాట. ఇక ఇప్పుడు ఆయన మరోసారి లెజెండ్ తరహా సినిమా చేస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరి ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుంది అనేది ఇంకా స్పష్టత లేదు. ఈ సినిమాలో బాలయ్య  పాత్ర గురించి కూడా త్వరలోనే స్పష్టత రాను౦ది.

మరింత సమాచారం తెలుసుకోండి: