తెలుగు చిత్ర పరిశ్రమలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి నేటి తరం యువ హీరోలలో ఎవ్వరికీ లేనంత క్రేజ్ వున్న విషయం తెలిసిందే.హిట్టు  ఫ్లాపులతో సంబంధం లేకుండా పవన్ కళ్యాణ్ అభిమానులు పెరిగిపోతున్నారు తప్ప ఎక్కడా తగ్గడం లేదు. ఇక ప్రస్తుతం పవర్  స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాలతో పాటు... సినిమాలను కూడా బాలన్స్ చేస్తున్న విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ చేసినవి కొన్ని సినిమాలు.. బ్లాక్ బస్టర్ హిట్ సాదించినవీ కొన్ని  సినిమాలు... కానీ పవన్ కళ్యాణ్ కు అభిమానులు మాత్రం భారీగానే ఉంటారు. కేవలం పవన్ కళ్యాణ్ హీరోయిజం చూసి అభిమానులు  అయిన వాళ్ళ కంటే పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం చూసి అభిమానులు అయిన వాళ్ళు ఎక్కువగా ఉంటారు. 

 


 ముక్కు సూటిగా మాట్లాడే తత్వంతో... నిజాయితీగా ఉండే వ్యక్తిగా అభిమానుల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. చిత్ర పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు. అయితే ఇప్పటివరకు పవన్ కళ్యాణ్  నటించిన ఎన్నో సినిమాల్లో విభిన్నమైన పాత్రల్లో నటించి తెలుగు ప్రేక్షకులను మెప్పించిన విషయం తెలిసిందే. ఇక పవన్ కళ్యాణ్ ఏ పాత్రలో నటించిన ఆ పాత్రలు కాస్త తిక్కుండాలి  దానికి కొంచెం లెక్క  ఉండాలి. అలా అయితేనే తెలుగు ప్రేక్షకులు బాగా సంతృప్తి చెందుతారు. 

 

 అయితే ఇప్పుడు వరకు పోలీస్ ఆఫీసర్ పాత్రలో, ఫైటర్ పాత్రలో, ఇలా ఎన్నో విభిన్నమైన పాత్రల్లో నటించారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. కానీ ఇప్పటి వరకు ఎక్కడా పౌరాణిక పాత్రల్లో మాత్రం నటించలేదు. అటు ప్రేక్షకులు కూడా పవన్ కళ్యాణ్ పౌరాణిక పాత్రల్లో అస్సలు ఊహించలేరు. గోపాల గోపాల సినిమా లో పవన్ కళ్యాణ్ కృష్ణుడి పాత్రలో నటించినప్పటికీ... పౌరాణికంగా గెటప్ మాత్రం వేయలేదు. కానీ కృష్ణుడి పాత్రలో మాత్రం మెప్పించారు పవన్  కళ్యాణ్ ఇలా పవన్ కళ్యాణ్ పౌరాణిక పాత్రల్లో నటిస్తున్నారు అంటే ప్రేక్షకులకు ఆ కిక్కే ఉండదు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: