టాలీవుడ్ లో మంచి స్టార్ ఇమేజ్ ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చినా సరే రానా తెచ్చుకున్న గుర్తింపు అందరికి తెలిసిందే. ఏ హీరో కి కూడా అంత ఫాస్ట్ గా స్టార్ హీరో గుర్తింపు గాని అలాంటి మంచి పాత్రలు చేసే అవకాశం గాని రాలేదు అనే చెప్తారు టాలీవుడ్ జనాలు. రానా సినిమాలు అనగానే జనాలకు ఒక క్రేజ్ ఉంటుంది. మొదటి రోజు సినిమా చూడకపోయినా సరే రానా సినిమాలను అన్ని వర్గాల ప్రేక్షకులు కచ్చితంగా చూస్తారు. అతని విషయంలో వర్గాలు మాత్రం కచ్చితంగా ఉండవు అనేది వాస్తవం. ఇక అతని సినిమాల విషయానికి వచ్చి చూస్తే... 

 

రానా ఏ పాత్రలో అయినా సరే కచ్చితంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటాడు అనేది వాస్తవం. అతను పౌరాణిక సినిమాలు చేసినా సరే యాక్షన్ సినిమాలు చేసినా రాజకీయ నేపధ్యం ఉన్న సినిమాలు చేసినా సరే ఆయన పాత్ర మాత్రం ఒక రేంజ్ లో హిట్ అవుతూ ఉంటుంది. నేనే రాజు నేనే మంత్రి సినిమాలు ఆయన చేసిన పాత్రకు గానూ చాలా మంచి మార్కులు పడ్డాయి అనే విషయం అందరికి తెలిసిందే. అలాగే ఎన్టీఆర్ బయోపిక్ లో కూడా రానా రాజకీయ నాయకుడిగా కనిపించారు. అలా ఏ పాత్రలో అయినా సరే తన మార్క్ ని రానా కచ్చితంగా వేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు అని జనాలు అంటారు. 

 

ఇప్పుడు రానా ఒక సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత అతను వివాహం చేసుకుని కొన్ని రోజుల పాటు సినిమాలకు దూరంగా ఉండే అవకాశాలు ఉన్నాయి అని అంటున్నారు. ప్రస్తుతం రానా చేస్తున్న సినిమా త్వరలోనే పూర్తి కానుంది. లాక్ డౌన్ కారణంగా ఆ సినిమా ఆగిపోయింది అని చెప్పవచ్చు. మరి షూటింగ్ ఎప్పుడు మొదలుపెట్టే అవకాశం ఉంది అనేది చెప్పలేని పరిస్థితి.

మరింత సమాచారం తెలుసుకోండి: