నేటి తరం హీరోలలో యూత్ లో  ఎక్కువగా క్రేజ్ ఉన్న హీరో ఎవరు అంటే అందరికీ టక్కున గుర్తొచ్చే పేరు రెబల్ స్టార్ ప్రభాస్. కేవలం హీరోగానే కాకుండా... తనదైన ఆటిట్యూడ్తో మంచితనంతో కూడా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు రెబల్ స్టార్ ప్రభాస్. అలనాటి రెబల్ స్టార్ కృష్ణంరాజు వారసుడిగా తెలుగు చిత్ర పరిశ్రమకు ఈశ్వర్ సినిమాతో హీరోగా పరిచయమైన ప్రభాస్ ఆ తర్వాత తెలుగు ప్రేక్షకులందరికీ డార్లింగ్ గా మారిపోయిన విషయం  తెలిసిందే. ఇక ఆ తర్వాత ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించి సంచలన విజయాన్ని అందుకున్నారు రెబల్ స్టార్ ప్రభాస్. 

 


 అయితే రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పటి వరకు నటించిన అన్ని సినిమాల్లో  లవర్ బాయ్ పాత్రలో కనిపించిన విషయం తెలిసిందే. లవర్ బాయ్ పాత్రలో నే తనదైన స్టైల్ ఆటిట్యూడ్తో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేశాడు రెబల్ స్టార్ ప్రభాస్. అంతేకాదు తెలుగు ప్రేక్షకులందరూ ప్రభాస్ ని ఏకంగా డార్లింగ్ అంటూ ప్రేమగా పిలుచుకుంటారు. ఇక రెబల్ స్టార్ ప్రభాస్ అమ్మాయిలకు కలల రాకుమారుడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే ఇప్పటి వరకు రెబల్ స్టార్ ప్రభాస్ లవర్ బాయ్ గా కనిపించడంతో పాటు బాహుబలి లాంటి సినిమాల్లో నటించి తనలోని రాజసాన్ని  కూడా తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసిన విషయం తెలిసిందే. 

 

 ప్రజల మనసుల్లో నిలిచిపోయింది ఒక రాజుగా ఎంతగానో రాజసాన్ని  ప్రదర్శించి... రెబల్ స్టార్ ప్రభాస్ హిస్టారికల్ పాత్రల్లోనూ తనకు తిరుగు లేదు అని నిరూపించారు. అయితే ఇప్పటివరకు లవర్ బాయ్ గా... బాహుబలి ఇలాంటి పాత్రల్లో కూడా మెప్పించిన ప్రభాస్ ను పౌరాణిక పాత్రల్లో మాత్రం అస్సలు ఊహించలేరు ప్రేక్షకులు. ఎందుకంటే రెబల్ స్టార్ ప్రభాస్ ని తెలుగు ప్రేక్షకులందరూ లవర్ బాయ్ గానే  అలవాటు పడిపోయారు. దీంతో అటు పౌరాణిక పాత్రల్లో  రెబల్ స్టార్ ప్రభాస్ ని అస్సలు ఊహించలేరు. అదే సమయంలో కొంతమంది ప్రభాస్ పౌరాణిక పాత్రలో నటిస్తే చూడాలని ఆసక్తి ఉన్న వారు కూడా లేకపోలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: