లాక్ డౌన్ సమయంలో చాలామంది సెలబ్రిటీలు ఇంటికే పరిమితం కావడంతో అభిమానులు సోషల్ మీడియాలో రకరకాలుగా అలరించారు. చాలా వరకు పెద్ద పెద్ద డైరెక్టర్ మరియు స్టార్ హీరోలు తెలుగు ఎలక్ట్రానిక్ మీడియా న్యూస్ చానల్స్ కి ఇంటర్వ్యూలు ఇస్తూనే, మరోపక్క ఇంటిలో ఉన్న భార్యలకు సహాయం చేస్తూ, తోట పనులు చేస్తూ వీడియోలు పోస్ట్ చేశారు. కొంతమంది లైవ్ లో అభిమానుల తో చిట్ చాట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇదే రీతిలో అల్లు అర్జున్ హీరోయిన్ ఇంకా లాక్ డౌన్ కొనసాగుతున్న తరుణంలో వంటగది పరిమితమైంది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో 'ఇద్దరమ్మాయిలతో' సినిమాలో బన్నీ పక్కన నటించిన కేథరిన్ తెర్సా లాక్ డౌన్ సమయములో రకరకాల టిప్స్ ఫాలో అవుతోంది.

IHG

వంట గదిలో రకరకాల ప్రయోగాలకు కేథరిన్ తెర్సా శ్రీకారం చుట్టింది. విజిటబుల్ సలాడ్ టబోలే తయారు చేస్తున్న ఫొటోలను షేర్ చేసింది. పలు రకాల కూరగాయలతో దీన్ని తయారు చేస్తారు. క్యాథరిన్ ప్రత్యేకమైన విజిటబుల్ సలాడ్ చేసింది. కూరగాయలను కట్ చేసేందుకు రెండు చాలా పదునైన కత్తులను వాడటం జరిగింది. ఇదే విషయాన్ని అభిమానులతో సోషల్ మీడియాలో పంచుకుంది. ప్రస్తుతం అవకాశాల కోసం ఎదురు చూస్తోంది.

IHG't my forte ...

టాలీవుడ్ ఇండస్ట్రీలో 'ఇద్దరమ్మాయిలతో' సినిమా తర్వాత ఈ ముద్దుగుమ్మ చాలామంది స్టార్ డైరెక్టర్లు కంట్లో పడింది. బోయపాటి, కృష్ణవంశీ, తేజ, క్రాంతి మాధవ్ ఇంకా కొంతమంది డైరెక్షన్ లో నటించిన కేథరిన్ తెర్సా...తన కెరీర్ కి అందానికి తగ్గట్టు బాక్సాఫీస్ దగ్గర సరైన హిట్ కొట్టలేకపోయింది. అయినా కానీ ఎక్కడ వెనకడుగు వేయకుండా అవకాశాల కోసం ఎదురు చూస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: