తెలుగు చిత్ర పరిశ్రమలో చిరంజీవిది  ఒక ప్రత్యేక ప్రస్థానం. ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా... తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమై... అప్పటికే తెలుగు చిత్ర పరిశ్రమలో సూపర్ హీరోలు గా కొనసాగుతున్న కృష్ణా ఎన్టీఆర్ లాంటి హీరోలను మైమరపించి సరికొత్త క్రేజ్ ను సంపాదించారు. ఇక ఆ తర్వాత వారి వారసులు గా వచ్చినా వారి పోటీని కూడా తట్టుకొని ఇప్పటికికూడా తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరో గా కొనసాగుతున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఇప్పటివరకు మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఏకంగా 150కి పైగా సినిమాల్లో నటించారు. ఇక ఈ 150 సినిమాల్లో  చిరంజీవి ఎన్నో విభిన్నమైన పాత్రల్లో నటించారు. 

 

ఈ సినిమాలో ఎన్నో ద్విపాత్రభినయాలు త్రిపాత్రాభినయం కూడా ఉన్నాయి. అయితే మెగాస్టార్ చిరంజీవి ఇప్పటివరకూ తన నటనతో ఎన్నో సార్లు విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్నారు  . ఏ హీరోకి సాధ్యం కాని రీతిలో తన ప్రస్థానాన్ని తెలుగు చిత్ర పరిశ్రమలో కొనసాగించారు. ఇక చిరంజీవి యాక్షన్ సన్నివేశాల్లో  అయినా... ఫ్యామిలీ ఎమోషన్స్ లో అయిన... లవర్ బాయ్ గా అయినా... ఫ్యాక్షనిస్టుగా  అయిన... చివరికి కామెడీ చేయడంలో అయిన ఆయనకు ఆయనే సాటి అని నిరూపించుకున్నారు. 

 


 ఇప్పటివరకు మెగాస్టార్ చిరంజీవి ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటించి తనకు తిరుగులేదని నిరూపించుకున్నారు . తనదైన కామెడీ టైమింగ్ తో యాక్షన్ సన్నివేశాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుని ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. అయితే మెగాస్టార్ చిరంజీవి దాదాపు గా మూడు దశాబ్దాల నుంచి తెలుగు చిత్ర పరిశ్రమలో తన ప్రస్థానాన్ని  కొనసాగిస్తున్నప్పటికి  ఇప్పటి వరకూ ఎప్పుడూ కూడా పౌరాణిక పాత్రల్లో నటించడానికి అంతగా ఆసక్తి చూపలేదు చిరంజీవి. ప్రేక్ష కులు కూడా చిరంజీవిని పౌరాణిక పాత్రల్లో అస్సలు ఊహించలేరు.

మరింత సమాచారం తెలుసుకోండి: