తెలుగు చిత్ర పరిశ్రమలో మహేష్ బాబు కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోగా టాలీవుడ్ నెంబర్ వన్ హీరో గా తన ప్రస్థానాన్ని  కొనసాగిస్తున్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. ప్రస్తుతం వరుస బ్లాక్బస్టర్ విజయాలను అందుకుంటూ దూసుకు పోతున్నాడు మహేష్ బాబు. అయితే ఇప్పటి వరకు మహేష్ బాబు ఎన్నో సినిమాల్లో నటించి విభిన్నమైన పాత్రల్లో కనిపించిన విషయం తెలిసిందే. బాల నటుడిగానే తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన మహేష్ బాబు... చిన్నప్పుడే ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు . 

 


 అయితే సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పటి వరకూ ఎన్నో సినిమాల్లో లవర్ బాయ్ పాత్రలో నటిస్తూ వచ్చిన విషయం తెలిసిందే. సూపర్ స్టార్ మహేష్ బాబు నుంచి లవర్ బాయ్ పాత్రలు తప్ప వేరే పాత్రలను అస్సలు ఊహించలేరు ప్రేక్షకులు. ఎందుకంటే మహేష్ బాబు రూపురేఖలు అలాంటివి మరి. నాలుగు పదుల వయస్సు దాటి పోతున్నప్పటికీ ... ఇంకా 20 ఏళ్ల యువకుడు గానే కనిపిస్తూ అమ్మాయిల మనసు దోచుకుంటున్నాడు  మహేష్ బాబు. అందుకే మహేష్ బాబు పేరు చెప్పగానే క్యూట్ గా కనిపించి... లవర్ బాయ్ పాత్రలో నటించే హీరో నే గుర్తుకొస్తారు ప్రేక్షకులకు ముందుగా. 

 


 అందుకే మహేష్ బాబు లవర్ బాయ్ పాత్రలో చేస్తేనే ఎక్కువగా ప్రేక్షకులు జీర్ణించుకోగలరు. ఇక వేరే పాత్రలో చేసిన కాస్త అడ్జస్ట్ చేసుకోగలరేమో.  కానీ మహేష్ బాబు పౌరాణిక పాత్రలో నటిస్తే... ఇది నిజంగా ప్రేక్షకుల ఊహకందని ప్రశ్న. ఎందుకంటే మిగతా హీరోల విషయంలో ఎలా ఉన్నప్పటికీ మహేష్ బాబు మాత్రం టాలీవుడ్ లో మోస్ట్ హ్యాండ్ సమ్  హీరోగా ఉన్నాడు. అలాంటి మహేష్ బాబుకి పౌరాణిక పాత్రలు అంటే అస్సలు సెట్ అవ్వవు  అని చెప్పాలి. అందుకే మహేష్ బాబు అలాంటి పాత్రల్లో ప్రేక్షకులు అస్సలు ఊహించలేరు.

మరింత సమాచారం తెలుసుకోండి: